Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP.. Possibility to start schools from 5th September

సెప్టెంబరు 5 నుంచి పాఠశాలల ప్రారంభించే అవకాశం - విద్యాశాఖ మంత్రి సురేష్‌ వెల్లడి
మంగళవారం సచివాలయంలో  విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ గారు విద్యాశాఖ చేపట్టబోవు కార్యక్రమాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
సమావేశం వివరాలు మంత్రి మాటల్లో...
>కరోనా వ్యాప్తి దృష్ట్యా సెప్టెంబరు 5 నుంచి పాఠశాలలు ప్రారంభించే అవకాశం ఉన్నది.
> వచ్చే విద్యా సంవత్సరం నుంచి అకడమిక్‌ ఆడిటింగ్‌ను ప్రవేశపెట్టేందుకు యోచిస్తున్నాం.
>పాఠశాలలపై పర్యవేక్షణ పెంచేందుకు ప్రస్తుతమున్న జిల్లా విద్యాధికారి (డీఈవో) పోస్టుల స్థాయిని సంయుక్త సంచాలకుల (జేడీ) స్థాయికి పెంచుతాము.
>కొత్తగా ఏర్పాటయ్యే 25 లేదా 26 జిల్లాలకు జేడీ పోస్టులుంటాయని వెల్లడించారు
>ఇప్పటికే 2 నెలల సమయం వృథా అయినందున సిలబస్‌, ప్రభుత్వ సెలవులను ఎలా కుదించాలనే అంశంపై త్వరలోనే నిర్దుష్ట ప్రణాళికను విడుదల చేస్తామన్నారు.
>స్కూల్స్‌ ప్రారంభించే వరకు జగనన్న గోరుముద్ద పథకం కింద విద్యార్థులకు మూడో విడత డ్రైరేషన్‌ పంపిణీ కొనసాగింపు. 
>అంగన్‌వాడీ కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలలతో అనుసంధానం
>ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్‌ విధివిధానాల రూపకల్పనకు కమిటీ ఏర్పాటు
>ఆన్‌ లైన్లో స్కూళ్లకు అనుమతులు, గుర్తింపు పత్రాలు జారీ చేయనున్నాం
>కడపలో వైఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో దివ్యాంగులైన విద్యార్థుల కోసం విజేతపేరుతో పాఠశాలలను నిర్వహిస్తున్నారని, ఇదే నమూనాతో నియోజకవర్గానికో పాఠశాల ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
> ఉపాధ్యాయుల కోసం జిల్లాకేంద్రంలో శాశ్వత ప్రాతిపదికన శిక్షణ కేంద్రం ఏర్పాటుచేయాలని సీఎం చెప్పారు. డైట్‌ కళాశాలలను శిక్షణ కేంద్రాలుగా మారుస్తాం. అక్కడ హాస్టల్‌ వసతి ఉంటుంది.
> ఈ ఏడాది నుంచి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలతోపాటు వర్క్‌బుక్‌లను ఇస్తాం.
> ఎయిడెడ్‌ పాఠశాలల్లో నిర్వహణ సరిగా లేకపోతే విచారణ చేయించి అవసరమైతే వాటిని పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకుంటాం.
>84 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఇప్పటికీ మంజూరైన పోస్టులు ప్రస్తుతం లేవు. వీటిని త్వరలోనే భర్తీ చేస్తాం.
> కొత్త సిలబస్‌ ఆధారంగా బ్రెయిలీ లిపిలో పుస్తకాలను ముద్రిస్తున్నాం.
> ఉమ్మడి సర్వీసు నిబంధనల అంశం ఇప్పటికీ పరిష్కరించ లేదు. దీనిపై కమిటీ నివేదిక రాగానే నిర్ణయం తీసుకుంటాం.
> ఉమ్మడి సర్వీసు నిబంధనల అంశం ఇప్పటికీ పరిష్కరించ లేదు. దీనిపై కమిటీ నివేదిక రాగానే నిర్ణయం తీసుకుంటాం.

Previous
Next Post »
0 Komentar

Google Tags