Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Huge salary increase for 108 staff

108 సిబ్బందికి భారీగా జీతాలు పెంపు
108 అంబులెన్స్‌ డ్రైవర్లకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జీతాలను భారీగా పెంచారు. సర్వీసుకు అనుగుణంగా డ్రైవర్ల జీతాన్ని రూ.18 నుంచి 20 వేల వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇంతకు ముందుకు డ్రైవర్లకు నెలకు రూ.10వేలు జీతం వస్తుండగా, ఇకపై వారి సర్వీసుకు అనుగుణంగా రూ.18వేల నుంచి 20వేల రూపాయల వరకు అందనుంది. అలాగే ఎమెర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్ల జీతాలను కూడా పెంచుతున్నట్లు సీఎం జగన్‌ ప్రకటించారు. ప్రస్తుతం రూ.12వేల జీతం అందుకుంటున్న మెడికల్‌ టెక్నీయన్‌ ఇకపై రూ.20 వేల నుంచి 30 వేల వరకు అందుతుందని సీఎం జగన్‌ చెప్పారు. పెంచిన జీతాలు ఈ రోజు నుంచే అమలులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు.
Previous
Next Post »
0 Komentar

Google Tags