Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

New banking rules from 1st july on ATM cash withdrawl and savings account

బ్యాంక్ కస్టమర్లపై మళ్ళీ చార్జీల మోత..జూలై 1 నుంచి కొత్త రూల్స్..!...
బ్యాంక్‌ లకు సంబంధించిన పలు అంశాలు జూలై 1 నుంచి మారబోతున్నాయి. బ్యాంక్‌లో అకౌంట్ ఉన్నవారు కచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని వియషయాలు..
1. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మార్చి నెలలో కీలక ప్రకటన చేశారు. ఏటీఎం చార్జీలు మిహాయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏ బ్యాంక్ ఏటీఎంలో అయినా డబ్బుల విత్‌డ్రా చేసుకోవచ్చని తెలిపారు. జూన్ 30 వరకు ఈ వెసులుబాటు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. దీంతో జూలై 1 నుంచి మళ్లీ బ్యాంక్ కస్టమర్లు ఉచిత ట్రాన్సాక్షన్ల పరిమితి దాటితే ఏటీఎం చార్జీలు చెల్లించాల్సి వస్తుంది.
2. ఏప్రిల్ నుంచి జూన్ వరకు మధ్య కాలంలో బ్యాంక్ కస్టమర్లు వారి ఖాతాల్లో ఎలాంటి మినిమమ్ బ్యాలెన్స్ కలిగి ఉండాల్సిన పని లేదు. ఎలాంటి చార్జీలు పడవు. అయితే జూలై 1 నుంచి మాత్రం మళ్లీ మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్ వర్తిస్తాయి. లేదంటే చార్జీలు భారించాల్సి ఉంటుంది. బ్యాంక్ ప్రాతిపదికన ఈ పెనాల్టీలు మారతాయి.
3. అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌లో చేరిన వారు నెలవారీ చందా మొత్తాన్ని బ్యాంక్ ఖాతాలో కలిగి ఉండాలి. బ్యాంకులు ఏపీవై స్కీమ్ ఆటో డెబిట్‌ను జూలై 1 నుంచి తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలిపాయి. కరోనా వైరస్ కారణంగా జూన్ 30 వరకు ఆటో డెబిట్ ఆప్షన్‌ను నిలిపివేస్తున్నట్లు బ్యాంకులకు ఆదేశాలు అందాయి.
4. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. జూలై 1 నుంచి ఈ తగ్గింపు నిర్ణయం అమలులోకి వస్తుంది. వడ్డీ రేట్లు 0.5 శాతం మేర తగ్గాయి. దీంతో బ్యాంక్‌లో డబ్బులు దాచుకునే వారికి 3 నుంచి 3.5 శాతం వరకు వడ్డీ వస్తుంది.
ఎస్బీఐ ATM విత్ డ్రా నిబంధనలు

నేటి నుంచి ఎస్బీఐ ATM విత్ డ్రా నిబంధనలు మారాయి. ఉచిత ట్రాన్సాక్షన్ను మించి డబ్బులు తీస్తే అదనంగా ఛార్జీలు పడుతున్నాయి. మెట్రో నగరాల్లో నెలకు ఎస్బీఐ ఏటీఎంలో 5, ఇతర బ్యాంకుల్లో 3 ( మొత్తం 8) సార్లు ఉచితంగా క్యాష్ డ్రా చేసుకోవచ్చు. ఇక నాన్ మెట్రో నగరాల్లో SBIలో 5, ఇతర బ్యాంకుల్లో 5( మొత్తం 10) సార్లు ఉచితంగా క్యాష్ డ్రా చేయవచ్చు. అంతకుమించి ఒక్కసారి డబ్బులు డ్రా చేసినా రూ 20+GST భారం పడుతుంది.
Previous
Next Post »
0 Komentar

Google Tags