Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Guidelines on Preventive Measures to Contain Spread of COVID-19 in Yoga Institutes & Gymnasiums

యోగా / జిమ్‌ కేంద్రాలకు మార్గదర్శకాలు విడుదల
అన్‌లాక్‌ 3.0 సడలింపులలో భాగంగా ఆగస్టు 5 నుంచి జిమ్‌లు, యోగా కేంద్రాలు తెరిచేందుకు కేంద్రం హోం శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది...
>కంటెయిన్‌మెంట్ ప్రాంతాల్లో ఉన్న జిమ్‌లు, యోగా కేంద్రాలు మూసి ఉంచాలని సూచించారు.
>65 ఏళ్ల వయస్సు వారు, అనారోగ్య సమస్యలున్నవారు గర్భిణీ స్త్రీలు, పదేళ్ల వయస్సు లోపు పిల్లలను జిమ్‌, యోగా కేంద్రాల్లోకి అనుమతించకూడదు.
>ప్రతి ఒక్కరు తప్పనిసరిగా 6 అడుగుల దూరం పాటించాలి. ఫేస్‌ గార్డ్స్‌/మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలి.
>వ్యాయామం చేసే సమయంలో ఎన్‌-95 మాస్క్‌లు ధరించకపోవడం మేలని సూచించారు.
>సబ్బుతో చేతులు కడుక్కోవడం, ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్‌తో చేతులు శుభ్రపరచుకోవడం వంటివి తరచుగా చేస్తుండాలి.
>దగ్గు, జలుబు వంటి వచ్చినప్పడు టిష్యూ, చేతి రుమాలుతో, మోచేతిని అడ్డుగా పెట్టుకోవాలి, ఉమ్మటం వంటివి చేయకూడదు.
>ఆరోగ్య సేతు యాప్‌ ప్రతి ఒక్కరు ఉపయోగించాలి.
>వ్యాయమాలు చేసేప్పుడు ప్రతి వ్యక్తికి మధ్య 4 చదరపు మీటర్ల దూరంతో పాటు, జిమ్‌లోని ఫిట్‌నెస్‌ సామాగ్రి మధ్య కూడా 6 అడుగుల దూరం ఉండేలా చర్యలు చేపట్టాలని సదరు యాజమాన్యాలకు సూచించారు.
>ఎయిర్‌కండిషన్డ్‌ ఉష్ణోగ్రతలు 24 నుంచి 30 డిగ్రీ సెంటిగ్రేడ్ మధ్య ఉంచడంతో పాటు, ప్రవేశ, నిష్ర్కమణలకు రెండు దార్లు ఉపయోగించడం మేలని పేర్కొన్నారు.
>ప్రతి రోజు తప్పని సరిగా డిస్‌ఇన్ఫెక్షన్‌ స్ప్రే చేయించాలని ఆదేశించారు.
> యోగా శిక్షణలో పాల్గొనే వారి సంఖ్య ఆధారంగా, శిక్షణ తరగతులు షెడ్యూల్ చేసుకోమని సూచించారు. అలానే ప్రతి శిక్షణ తరగతి మధ్య 15 నుంచి 30 నిమిషాల వ్యవధి ఉండాలి.
> స్పా, స్టీమ్‌ బాత్‌, స్విమ్మింగ్ పూల్ వంటివి మూసి ఉంచాలని ఆదేశించారు.
Guidelines on Preventive Measures to Contain Spread of COVID-19 in Yoga Institutes & Gymnasiums
Previous
Next Post »
0 Komentar