Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Hurry up! Inter admissions in Navodaya Vidyalayas Deadline for application is 5 days


Hurry up..! Inter admissions in JNV.. Deadline for application is 5 days
న‌వోద‌య విద్యాల‌యాల్లో ఇంటర్‌ అడ్మిషన్లు.. దరఖాస్తుకు 5 రోజులే గడువు.. త్వరపడండి..!
జ‌వ‌హ‌ర్ న‌వోద‌య విద్యాల‌యాల్లో ఇంట‌ర్మీడియ‌ట్‌ ప్ర‌వేశాల దరఖాస్తు గడువు త్వరలో ముగియనుంది. నోయిడాలోని న‌వోద‌య విద్యాల‌య స‌మితి దేశ‌వ్యాప్తంగా ఉన్న జ‌వ‌హ‌ర్ న‌వోద‌య విద్యాల‌యాల్లో 2020-21 విద్యాసంవత్సరంకి  గాను ఇంట‌ర్మీడియ‌ట్‌ ప్ర‌వేశాల కోసం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. గత విద్యా సంవత్సరం (2019-20)లో పదో తరగతి ఉత్తీర్ణత అయిన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలకు https://navodaya.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.
ముఖ్య సమాచారం:
జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో ఇంట‌ర్మీడియ‌ట్ ప్ర‌వేశాలు 2020-21
అర్హ‌త‌: 01.06.2002 నుంచి 31.05.2006 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి. 2019-20 విద్యాసంవ‌త్స‌రంలో ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: ప‌దోత‌ర‌గ‌తిలో సాధించిన మార్కుల ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 31-08- 2020
వెబ్‌సైట్‌: https://navodaya.gov.in/
Previous
Next Post »
0 Komentar

Google Tags