Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Adobe India Women-in-Technology Scholarship



Adobe India Women-in-Technology Scholarship
అమ్మాయిలకు అడోబ్ స్కాలర్‌షిప్స్
సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ విభాగాల్లో మహిళలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన అడోబ్ ఇండియా విమెన్ ఇన్ టెక్నాలజీ స్కాలర్‌షిప్ నోటిఫికేషన్ వెలువడింది. కంప్యూటర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల్లో సాంకేతిక కోర్సులు చేస్తున్న యువతులకు ఇది చక్కని అవకాశం.
అర్హతల వివరాలు:
• కంప్యూటర్ సైన్స్ | ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ సైన్స్, డేటా సైన్స్, ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మేడ్స్ అండ్ కంప్యూటింగ్ విభాగాల్లో నాలుగేళ్ల బీఈ / బీటెక్ కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
 • ఇంటిగ్రేటెడ్ ఎంఈ/ ఎంఎస్ | ఎం టెక్ కోర్సుల్లో ప్రవేశం పొందినవారు కూడా దరఖాస్తుకు అర్హులే. కోర్సు 2022 నాటికి పూర్తి కావాలి.
• అడోబ్ సంస్థ ఉద్యోగుల కుటుంబీకులు, ఇతర సంబంధీకులు దరఖాస్తుకు అనర్హులు.
స్కాలర్షిప్ సమాచారం:
• ఎంచుకున్న కోర్సు పూర్తయ్యే వరకు ట్యూషన్ ఫీజు మొత్తం చెల్లిస్తారు.
• అడోబ్ - ఇండియాలో 2021 సమ్మర్ ఇంటర్న్ షిప్ అవకాశం కల్పిస్తారు.
 • అడోబ్ సంస్థలోని సీనియర్ టెక్నాలజీ లీడర్ మెంటార్‌గా వ్యవహరిస్తారు.
 • సంస్థ ఖర్చులతో గ్రాస్ హోపర్ కాన్ఫరెన్స్ లో పాల్గొనే అవకాశం ఇస్తారు.
 ఎంపిక:
అకడమిక్ ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది. దీంతోపాటు సృజనాత్మక నైపుణ్యం, టెక్నికల్ స్కిల్స్, అనలిటికల్ సామర్థ్యం, టీమ్ వర్క్, నాయకత్వ లక్షణాలను పరిగణనలోకి తీసుకుంటారు.
ముఖ్య సమాచారం
ఆన్లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 20
వెబ్ సైట్ research.adobe.com
అదనపు ఉపయోగకరమైన వెబ్‌సైట్ లింక్స్: Notification  మరియు Application

Previous
Next Post »
0 Komentar

Google Tags