Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Don’t drink water after eating peanuts


Don’t drink water after eating peanuts.
పల్లీలు” తిని నీటిని తాగరాదు…ఎందుకో తెలుసా..?

పల్లీలు ఇష్టపడని వారుండరు..వేపుకుని, ఉప్పువేసి ఉడకపెట్టుకుని తినడానికి ఎక్కువగా ఇష్టపడతాం..చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్లు కానివ్వండి పల్లీలు కనపడగానే పచ్చీవే నోట్లో వేసుకుని నమిలేస్తుంటారు. పల్లీలు తినగానే నీళ్లు తాగుతుంటాం, కానీ మన ఇళ్లల్లో పెద్దవాళ్లు హే పల్లీలు తినగానే  నీళ్లు తాగకు దగ్గొస్తుంది అంటుంటారు. పల్లీలు శరీరానికి పోషకాలు అందిస్తాయి..మరి వీటిని తినగానే నీళ్లెందుకు తాగకూడదు..తాగితే సమస్యెందుకు వస్తుంది.

దానికి కారణాలు ఏంటి తెలుసుకోండి..

1. పల్లీలలో ఆయిల్ అధిక శాతం ఉంటుంది. అందువలన పల్లీలను తిన్న వెంటనే నీటిని తాగితే అది పల్లీల్లో ఉండే ఆయిల్‌తో కలిసి ఆహార నాళంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది.
2. పల్లీలు తినగానే నీళ్లు తాగొద్దు అనడానికి గల మరో కారణం.. పల్లీలు సహజంగానే ఒంట్లో వేడిని కలిగిస్తాయి. అలాంటప్పుడు వీటిని తినగానే నీటిని తాగితే అవి చల్లగా ఉంటాయి కాబట్టి లోపల వేడి పదార్థం, చల్లని పదార్థం ఒకదానికొకటి పొసగవు. ఈ క్రమంలో దగ్గు, జలుబు వంటి శ్వాస కోశ సమస్యలు వస్తాయి.
3. చివరిగా మరో కారణం ఏమిటంటే.. పల్లీలను తినగానే నీటిని తాగితే అవి త్వరగా జీర్ణం కావు. దీంతో గ్యాస్, అజీర్ణం ఇబ్బంది పెడతాయి. కనుక పల్లీలను తినగానే కనీసం 15 నుంచి 20 నిమిషాల వరకు వేచి ఉండడం ఉత్తమం. అప్పుడు కూడా వేడి నీరు తాగాల్సి ఉంటుంది. దీంతో తిన్న ఆహారం త్వరగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా జీర్ణమవుతుంది.

Previous
Next Post »

1 comment

Google Tags