Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

DOST 2020 registration - Today is the last date



DOST 2020 registration - Today is the last date
DOST 2020 మొదటి విడత రిజిస్ట్రేషన్‌కు నేడే చివరి తేదీ.
దోస్త్‌ 2020
తెలంగాణలో ఆన్‌లైన్‌ డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి దోస్త్-2020‌ ఫేజ్-1 (మొదటి విడత) రిజిస్ట్రేషన్ తేదీని ఒక రోజు పొడిగించారు. సెప్టెంబర్‌ 7తో ముగియనున్న రిజిస్ట్రేషన్లను ఈనెల 8వ తేదీ వరకు పొడిగించినట్లుగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ మరియు దోస్త్‌ కన్వీనర్‌ ఆచార్య ఆర్‌. లింబాద్రి ఓ ప్రకటనలో తెలిపారు.
దోస్త్‌ ఫేజ్‌-1 రిజిస్ట్రేషన్‌ 7వ తేదీతో ముగుస్తుండగా విద్యార్థుల‌ అభ్యర్థన మేరకు 8 వ తేదీ వరకు దోస్త్‌ కన్వీనర్‌ పొడిగించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఎవరైతే రిజిస్ట్రేషన్‌ చేసుకోలేదో వారు పొడిగించిన రోజును సద్వినియోగం చేసుకోవాల‌న్నారు. తక్కువ మంది వెబ్ ఆప్షన్లు ఇవ్వటంతో గడువుతేదీని పొడించారు.
ఇంటర్ లేదా దానికి సమాన అర్హత ఉన్నవారు దోస్త్ ద్వారా డిగ్రీ అడ్మిషన్ పొందవచ్చు. ఆగష్టు 24 నుంచి మొదలైన ఈ దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ మూడు ఫేజ్‌లలో అక్టోబర్ 12 నాటికి పూర్తి కానుంది. ఇక ఆ తర్వాత విద్యార్థులకు డిజిటల్ లేదా ఫిజికల్ క్లాసులు మొదలుపెట్టనున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్థులు https://dost.cgg.gov.in/  వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags