Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IIT admissions from October 6th



IIT admissions from October 6th
అక్టోబర్ 6 నుంచి ఐఐటీ ప్రవేశాలు
ఏడు దశల్లో ప్రక్రియ
నవంబర్ 9వ తేదీ నాటికి పూర్తి, ఏడు దశల్లో ప్రక్రియ, ప్రవేశాల కౌన్సెలింగ్ తాత్కాలిక షెడ్యూల్ ఖరారు, ఈనెల 12 నుంచి అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్లు - 27న పరీక్ష , వచ్చే నెల 5న ఫలితాలు, 6 నుంచి రిజిస్ట్రేషన్లు.
దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్ ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే విద్యా సంస్థల్లో (జీఎసీఐ) ఉమ్మడి ప్రవేశాలను వచ్చే నెల 6 నుంచి చేపట్టి నవంబర్ 9వ తేదీలోగా పూర్తి చేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెమోడీ) నిర్ణయించింది. ఈ మేరకు పూర్తి స్థాయి షెడ్యూల్ ఖరారుపై దృష్టి సారించింది. ఇందులోభాగంగా ఉమ్మడి ప్రవేశాల ప్రారంభ, ముగింపు తేదీలను కూడా తాత్కాలికంగా ఖరారు చేసింది. ప్రస్తుతం నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్ ఈనెల 6తో ముగియనుండగా, జేఈఈ అడ్వాన్స్ ను ఈ నెల 27న ఆన్ లైన్లో నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూల్‌ను ఖరారు చేసింది. దీనికి అనుగుణంగానే ఫలితాలను విడుదల చేసి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ఆధ్వర్యంలో వచ్చేనెలలో ఉమ్మడి ప్రవేశాల ప్రక్రియను ప్రారంభిస్తారని ఢిల్లీ ఐఐటీ వెల్లడించింది. వచ్చేనెల 6న ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమై నవంబర్ 9తో ముగుస్తుందని జేఈఈ అడ్వాన్స్డ్ వెబ్ సైట్ లో స్పష్టం చేసింది.
12 నుంచి 'అడ్వాన్స్డ్  ''రిజిస్ట్రేషన్లు.. జేఈఈ మెయిన్ ఫలితాలను ఈనెల 11లోగా విడుదల చేసేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎసీఏ) కసరత్తు చేస్తోంది. గత జనవరి జేఈఈ మెయిన్, ప్రస్తుత మెయిన్ పరీక్షల్లో అర్హత సాధించిన టాప్ 2.5 లక్షల మంది విద్యార్థులను జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హులుగా పరిగణనలోకి తీసుకుంటామని ఢిల్లీ ఐఐటీ వెల్లడించింది. వారంతా ఈ నెల 12 నుంచి జేఈఈ అడ్వాన్స్ట్రకు దరఖాస్తు చేసుకునేలా షెడ్యూలను జారీ చేసింది. ఈనెల 17న సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చని, 18న సాయంత్రం 5 గంటల వరకు ఫీజు చెల్లించవచ్చని వెల్లడించింది. 21వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 27వ తేదీ ఉదయం 9 గంటల వరకు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. ఆన్లైన్ పరీక్ష 27న ఉంటుందని, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపరు-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపరు - పరీక్ష ఉంటుందని వెల్లడించింది. కాగా, విదేశాల్లో 12వ తరగతి చదువుకున్న, చదువుతున్న విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్ కు ఈనెల 5నుంచే దరఖాస్తు చేసుకోవాలని ఢిల్లీ ఐఐటీ తెలిపింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags