Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NVS Recruitment 2020: Apply for 454 PGT, TGT & FCSA posts




NVS Recruitment 2020: Apply for 454 PGT, TGT & FCSA posts
ఎన్‌విఎస్ రిక్రూట్‌మెంట్ 2020: 454 పిజిటి, టిజిటి, ఎఫ్‌సిఎస్‌ఎ పోస్టులకు దరఖాస్తు
నవోదయ విద్యాలయ సమితి (NVS) 454 టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మహారాష్ట్ర, గుజరాత్, గోవా, డామన్ అండ్ డయ్యూ, దాద్రా అండ్ నగర్ హవేలీ రాష్ట్రాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న ఈ 454 మంది ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయనుంది.
అర్హులైన అభ్య‌ర్థుల నుండి ద‌ర‌ఖాస్తుల‌ను ఈ-మెయిల్ ద్వారా ఆహ్వానించింది. గోవా, గుజ‌రాత్‌, మ‌హారాష్ర్ట‌, డామ‌న్‌ డ‌య్యు, దాద్రా న‌గ‌ర్ హ‌వేలీలో ఖాళీలను అనుస‌రించి కాంట్రాక్ట్ ప్రాతిప‌దిక‌న భ‌ర్తీ చేప‌ట్ట‌నున్న‌ట్లు ఎన్‌వీఎస్ తెలిపింది. 
మొత్తం 454 ఖాళీల్లో 73 ఫ్యాకల్టీ-కమ్-సిస్టమ్-అడ్మినిస్ట్రేటర్ పోస్టులు కాగా.. 98 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT), 283 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT) పోస్టులున్నాయి. పీజీటీ పోస్టుల‌కు నెల‌వారీ జీతం సాధార‌ణ స్టేష‌న్ అయితే రూ. 27,500గా అదే హార్డ్ స్టేష‌న్‌ (కుచ్‌, డాంగ్స్‌, ర‌త్న‌గిరి) లోనైతే నెల‌కు రూ. 32,500గా ఉంది. టీజీటీ పోస్టుల‌కు నెల‌వారీ జీతం సాధార‌ణ స్టేష‌న్‌లోనైతే రూ. 26,250గా అదే హార్డ్ స్టేష‌న్ ‌(కుచ్‌, డాంగ్స్‌, ర‌త్న‌గిరి)లోనైతే నెల‌కు రూ.31,250 గా ఉంది. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 11, 2020వ తేదీ లోగా దరఖాస్తులు సమర్పించాలి. ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
ద‌ర‌ఖాస్తుల‌ను conpune20@gmail.com కు పంపించాలి. లేదా గూగుల్‌ ఫామ్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలంటే క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
నోటిఫికేషన్: ↓


Previous
Next Post »
0 Komentar

Google Tags