Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SBI ATM cash withdrawal rules changing from September 18 – All you need to know



SBI ATM cash withdrawal rules changing from Sep 18 – All you need to know
ఎస్‌బి‌ఐ:  సెప్టెంబర్ 18 నుంచి కొత్త రూల్స్, మారే అంశాలివే!, దీంతో కస్టమర్లకు బెనిఫిట్

ఎస్‌బీఐ కస్టమర్లకు ముఖ్యమైన అలర్ట్. బ్యాంక్ సెప్టెంబర్ 18 నుంచి కొత్త రూల్స్ అమలులోకి తీసుకువస్తోంది. దీంతో బ్యాంక్ ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునే వారు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. 

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తాజాగా తన కస్టమర్లకు తీపికబురు అందించింది. కొత్త రూల్స్ అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ఏటీఎం క్యాష్ విత్‌డ్రా రూల్స్‌‌లో మార్పులు చేసింది. ఏటీఎం మోసాలను నియంత్రించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది.

ఎస్‌బీఐ ఇటీవల ఓటీపీ ఆధారిత ఏటీఎం క్యాష్ విత్‌డ్రా సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. రూ.10,000 లేదా ఆపైన మొత్తాన్ని ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసుకోవాలంటే కచ్చితంగా ఓటీపీ ఎంటర్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దీన్ని ఎంటర్ చేసి డబ్బులు తీసుకోవాలి.

ఈ సదుపాయం రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వకు మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే ఇప్పుడు ఎస్‌బీఐ ఓటీపీ ఆధారిత ఏటీఎం క్యాష్ విత్‌డ్రా రూల్స్‌ను రోజంత అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. అంటే మీరు ఎప్పుడైనాసరే ఎస్‌బీఐ నుంచి రూ.10,000కు పైన డబ్బులు తీసుకోవాలంటే కచ్చితంగా ఓటీపీ ఎంటర్ చేయాల్సిందే.

ఓటీపీ ఆధారిత క్యాష్ విత్‌డ్రా రూల్స్‌ను 24 గంటలు అందుబాటులోకి తీసుకురావడంతో ఏటీఎం మోసాలు తగ్గుతాయని బ్యాంక్ విశ్వాసంతో ఉంది. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ డెబిట్ కార్డు కలిగిన వారు ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవడానికి వెళ్లేటప్పుడు మొబైల్ ఫోన్ కూడా వెంట తీసుకెళ్లండి. లేదంటే ఇబ్బంది పడాల్సి రావొచ్చు. 

కాగా ఈ ఓటీపీ ఆధారిత క్యాష్ విత్‌డ్రా రూల్స్ ఏటీఎం ఎస్‌బీలకు మాత్రమే వర్తిస్తుంది. ఇతర బ్యాంకుల ఏటీఎంలకు వర్తించదు. కాగా స్టేట్ బ్యాంక్.. అసెట్స్, డిపాజిట్స్, బ్రాంచులు, కస్టమర్లు, ఉద్యోగులు ఇలా ఏ ప్రాతిపదికన చూసిన దేశంలో అతిపెద్ద బ్యాంక్‌గా ఉంది. 2020 మార్చి 31 నాటికి ఎస్‌బీఐ డిపాజిట్ బేస్ రూ.32 లక్షల కోట్లుగా ఉందని చెప్పుకోవచ్చు.

Previous
Next Post »
0 Komentar

Google Tags