Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Teachers are our heroes: Modi


Teachers are our heroes: Modi
ఉపాధ్యాయులే మన హీరోలు: మోదీ
పిల్లలను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దుతూ, జాతినిర్మాణం కోసం కష్టించి పనిచేస్తోన్న ఉపాధ్యాయుల కృషిని ప్రజలు ఎన్నటికీ మరువలేరని ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ "మన ఉపాధ్యాయులే మన హీరోలు"అని ట్వీట్ చేశారు. ప్రజలు విజ్ఞానం వైపు నడిపించే అసలైన దేశ నిర్మాత ఉపాధ్యాయులే అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా శనివారం ఆయనకు నివాళి అర్పించారు. దేశ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దడంలో నిత్యం శ్రమిస్తున్న ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో తాను చేసిన ప్రసంగంలోని కొన్ని మాటలను ప్రస్తావించారు దేశ చరిత్రను, స్వాతంత్ర్య పోరాటాన్ని గురించి తెలిపిన గురువులే తమ హీరోలు అని పేర్కొన్న వాక్యాలను గుర్తు చేసుకున్నారు.
Previous
Next Post »
0 Komentar

Google Tags