Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TSCHE has released the results of Telangana ECET-2020.



TSCHE has released the results of Telangana ECET-2020
ECET 2020 ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే..!
తెలంగాణ ఈసెట్‌-2020 ఫ‌లితాల‌ను తెలంగాణ ఉన్న‌త విద్యా మండ‌లి విడుద‌ల చేసింది.
 రాష్ట్రంలో పాలిటెక్నిక్‌, బీఎస్సీ మ్యాథ్స్‌ పూర్తయిన విద్యార్థులు బీటెక్‌, బీఫార్మసీ కోర్సుల్లో ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించిన తెలంగాణ ఈసెట్‌-2020 ఫ‌లితాల‌ను తెలంగాణ ఉన్న‌త విద్యా మండ‌లి విడుద‌ల చేసింది. జేఎన్‌టీయూ, హైద‌రాబాద్ ఆధ్వ‌ర్యంలో ఆగ‌స్టు 31న రాష్ట్రవ్యాప్తంగా 56 కేంద్రాల్లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ను కోవిడ్‌-19 మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.

డైరెక్ట్‌ లింక్‌: https://ecet.tsche.ac.in/TSECET/TSECET_GetRankCard.aspx క్లిక్‌ చేయండి.

ఈ ఏడాది 97.58 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 90.83 శాతం మంది హాజరయ్యారు. తెలంగాణలో 14, ఏపీలో 4 చోట్ల నిర్ణయించిన పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. కరోనా పరిస్థితుల అనంతరం నిర్వహించిన తొలి పరీక్ష ఇదే. ఈ పరీక్షకు మొత్తం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 28,016 మంది. కాగా పరీక్షకు హాజరయిన వారు 25,448 మంది కావడం గమనార్హం.

Previous
Next Post »
0 Komentar

Google Tags