Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Village and ward secretariat exams from 20th - Latest rules have to be followed



Village and ward secretariat exams from 20th - Latest rules have to be followed 
AP: ఈనెల 20 నుంచి గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు.. తాజా నిబంధనలు పాటించాల్సిందే..!
సచివాలయ పరీక్షలు నిర్వహించడానికి సర్వం సిద్ధం చేశారు. కరోనా పాజిటివ్ వున్న అభ్యర్ధులకు ఐసోలేషన్‌ రూముల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.
ప్రధానాంశాలు:
గంట ముందే లోనికి అనుమతి, నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు.
అభ్యర్థులు బూట్లు వేసుకురావద్దు, కరోనా లక్షణాలుంటే ఐసోలేషన్ రూమ్‌లో పరీక్ష.

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. మొత్తం 16,208 పోస్టుల భర్తీకి సెప్టెంబ‌రు 20 నుంచి 26 వరకు రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. కరోనా ‌ లక్షణాలున్న అభ్యర్థులకు ప్రత్యేక గది ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే.. పరీక్ష మొదలయ్యాక నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమన్నారు. ఈ పరీక్షలకు సంబంధించి 10 లక్షల మంది ఇప్పటి వరకు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారు.

తాజా నిబంధనలు:
మొత్తం10.56 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 20న ఉదయం, మధ్యాహ్నం జరిగే పరీక్షలకు 6.81 లక్షల మంది హాజరుకానున్నారు. ఈ పరీక్షలకు 3,289 పరీక్ష కేంద్రాలను.. 77,558 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు.
అభ్యర్థులు గంట ముందే కేంద్రం లోపలికి వెళ్లొచ్చు. పరీక్ష మొదలయ్యాక మాత్రం నిమిషం ఆలస్యమైనా అనుమతించబోరు.
బూట్లు ధరించి రాకూడదు. శానిటైజర్లు, పారదర్శక చేతి గ్లౌవ్స్‌తో రావచ్చు. ఓఎమ్‌ఆర్‌ షీటు కార్బన్‌ కాపీని వెంట తీసుకెళ్లొచ్చు.
దివ్యాంగులు మరొకరితో పరీక్ష రాయించేలా ఏర్పాట్లు చేశారు. వీరికి గంటకు 25 నిమిషాల చొప్పున అదనపు సమయం ఇస్తారు.


కరోనా లక్షణాలుంటే ప్రత్యేక గది:
ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో కేవలం అభ్యర్థుల్ని మాత్రమే తీసుకెళ్లాలని ఆదేశాలిచ్చారు.
అభ్యర్థులు తప్పనిసరిగా మాస్కు ధరించి రావాలి. థర్మల్‌ స్కానింగ్‌ చేశాకే లోనికి అనుమతిస్తారు.
భౌతికదూరం ఉండేలా ఒక్కో గదిలో 14 నుంచి 20 మంది మాత్రమే పరీక్ష రాస్తారు.
ఇప్పటికే కొవిడ్‌ వచ్చిన వారికి, అనుమానిత లక్షణాలున్న వారికి, శరీర సగటు ఉష్టోగ్రత అధికంగా ఉన్నవారికి ప్రత్యేక గదులు కేటాయిస్తారు.

అర్హత ఉన్న వారికే హాల్‌టికెట్లు:
కొంతమంది హాల్ టికెట్స్ రాలేదని ఆందోళన చెందుతున్నట్లు తెలిసిందని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. నిర్దేశించిన అర్హతలు ఉన్నవారికి మాత్రమే హాల్ టికెట్స్ వస్తాయని తెలిపారు. ఉద్యాన, పశు సంవర్థక సహాయకుల పోస్టుల కంటే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్యే తక్కువగా ఉంది. అలాగని ఉద్యోగ ప్రకటనలో పేర్కొన్న అర్హతలను తగ్గిస్తే ప్రభుత్వ ఉద్దేశం దెబ్బతింటుంది. ఈ రెండు పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో నిర్దేశిత అర్హతలున్న వారికే హాల్‌టికెట్లు వస్తాయి.

వ్యవసాయ సహాయకుడి పోస్టుకు బీఎస్సీ బోటనీ అభ్యర్ధులు అర్హులు కారని అన్నారు. వ్యవసాయశాఖలో ఎంపీఈఓ గా పనిచేస్తూ డిగ్రీలో బోటనీ ఒక సబ్జెక్టుగా చదివిన వారు.. గ్రామ వ్యవసాయ సహాయకులు (గ్రేడ్‌-2) పరీక్ష రాయడానికి అనర్హులని అన్నారు. ఒకవేళ పరీక్ష రాసినా.. వారి అభ్యర్ధిత్వాన్ని పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టంచేశారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags