Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Electricity charges depending upon usage timings

Electricity charges depending upon usage timings
వాడుకునే వేళలను బట్టి విద్యుత్తు ఛార్జీలు 


మీరు ఏ ఏ సమయంలో ఎక్కువ విద్యుత్తు వాడుతున్నారు?
పగటివేళా..? రాత్రి వేళా?
కేంద్ర విద్యుత్తు శాఖ రూపొందిస్తున్న కొత్త టారిఫ్‌ విధానం అమలులోకి వస్తే భవిష్యత్తులో విద్యుత్తు బిల్లుల విదానంలో సమూల మార్పులు రానున్నాయి. మీరు ఉదయం వేళ విద్యుత్తు వినియోగించుకుంటే ఒక ధర..రాత్రివేళైతే మరో ధర ఉంటుంది.  జాతీయస్థాయిలో విద్యుత్తు ఛార్జీల నిర్ణయ విధానాన్ని తీసుకువచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. రాష్ట్రాలకు ఇది మార్గదర్శకంగా కూడా ఉండాలని భావిస్తోంది. కేంద్ర విద్యుత్తుశాఖ సిద్ధం చేస్తున్న ప్రతిపాదనల మేరకు వినియోగదారుల నిర్దిష్ట అవసరాలు, విద్యుత్తుకు ఉన్న గిరాకీ, సరఫరాలను కూడా పరిగణనలోకి తీసుకొని ఛార్జీలను నిర్ణయిస్తారు. ఇందుకోసం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఇలా ఏ సమయంలో విద్యుత్తు వాడుతున్నారన్నది లెక్కలోకి తీసుకుంటారు. ఎండాకాలంలో అయితే ఒకలా, వర్షాకాలంలో అయితే మరోలా, చలికాలంలో అయితే ఇంకోలా రుసుములు నిర్ణయించే అవకాశం ఉంది. 

కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యుత్తు ఛార్జీల విధానాన్ని రూపొందించే క్రమంలో వినియోగదారుల నిర్దిష్ట అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని యోచిస్తోంది. విద్యుత్తు వినియోగంపై కచ్చితమైన అవగాహన కోసం ప్రతి ఇంట్లోనూ స్మార్ట్‌ మీటర్‌ ఏర్పాటును తప్పని సరి చేసేలా కూడా కొత్త విధానం ఉంటుంది. ఈ ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదానికి సమర్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేంద్రం ఆమోదించిన తరవాత ఈ విధానం అమలుకు రాష్ట్రాలను కూడా ఒప్పించేందుకు ప్రయత్నిస్తారు.
మూలం: తేది:15-07-2019 నాటి ఈనాడు దినపత్రిక

Previous
Next Post »
0 Komentar

Google Tags