Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Kargil Vijay Diwas

Kargil Vijay Diwas

నేడు కార్గిల్ విజయ్ దివస్
కార్గిల్ విజయ దినోత్సవం ప్రతి ఏటా జూలై 26న దేశవ్యాప్తంగా జరుపబడుతుంది.
ఉగ్రవాదుల ముసుగులో కశ్మీర్‌ను కబళించేందుకు పాక్ చేసిన కుటిల ప్రయత్నాలను భారత్ తిప్పికొట్టి నేటికి 20 ఏళ్లు.
ఉగ్రమూకలతో చేతుల కలిపిన పాక్.. భారత్‌తో పోరాడుతోంది మేం కాదు.. కశ్మీర్ స్వాతంత్ర్యాన్ని ఆకాంక్షించే వాళ్లేఅని పాకిస్తాన్ ప్రపంచాన్ని నమ్మించాలని చూసింది. కానీ కార్గిల్ యుద్ధంలో ఇండియన్ ఆర్మీ విసిరన పంజాకు చావు దెబ్బతింది. ఉగ్రవాదులతో కలిసి కశ్మీర్లోని కార్గిల్ సెక్టార్‌ను ఆక్రమించిన పాకిస్థాన్ సైన్యాన్ని ఇండియన్ ఆర్మీ తరిమికొట్టింది. ఈ యుద్ధంలో అమరులైన జవాన్ల త్యాగాలను స్మరించుకోవడానికి ఏటా జూలై 26న విజయ్ దివస్ జరుపుకొంటున్నాం.
జమ్మూ కశ్మీర్లోని కార్గిల్‌లో 1999 మే-జూలై నెలల మధ్య ఈ యుద్ధం జరిగింది. నాటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు తెలియకుండానే ఆర్మీ చీఫ్ నవాజ్ షరీఫ్ భారత్‌తో యుద్ధానికి దిగాడు. పాక్ సైన్యం.. ఉగ్రవాదుల ముసుగులో భారత భూభాగంలోకి ప్రవేశించింది. ఎత్తయిన కొండ ప్రాంతాలను, వ్యూహాత్మకంగా కీలక ప్రాంతాలను ఆక్రమించిన పాక్ బలగాలు.. యుద్ధానికి కాలు దువ్వాయి. స్థానిక గొర్రెల కాపరులు ఇచ్చిన సమాచారంతో అప్రమత్తమైన భారత సైన్యం.. ఆపరేషన్ విజయ్‌కు శ్రీకారం చుట్టింది.
ఎత్తయిన మంచు కొండ ప్రాంతాల్లో ఉగ్రవాదులతో కలిసి పాక్ సైనికులు భారత ఆర్మీపైకి దాడి ప్రారంభించారు. ఎత్తులో ఉండటం శత్రువులకు అనుకూలంగా మారింది. దిగువన ఉండటం ప్రతికూలంగా మారడంతో.. భారతీయ సైనికులు ప్రాణాలకు తెగించి మరీ వారితో పోరాడారు. సాహసంతో కొండల పైకి ఎక్కి టైగర్ హిల్, టోలోలిగ్ కొండలపై మకాం వేసిన పాక్ సైన్యాన్ని తరిమికొట్టారు.
పాకిస్థాన్ మన దేశానికి చెందిన రెండు ఫైటర్ జెట్లను కూల్చేసింది. దీంతో ఇండియన్ ఆర్మీ మరింతగా రెచ్చిపోయింది. యుద్ధంలో ఓటమి తప్పదని భావించిన పాక్..జోక్యం చేసుకోవాలని అమెరికాను కోరింది. నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ పాక్ ప్రతిపాదనకు అంగీకరించలేదు సరికదా..నియంత్రణ రేఖ దాటి భారత భూభాగంలో అడుగుపెట్టిన పాక్ బలగాలు వెంటనే వెనుదిరగాలని హెచ్చరించాడు.
కార్గిల్ నుంచి పాక్ బలగాలు వెనుదిరగడంతో.. భారత సైన్యం మిగతా ఔట్ పోస్టుల్లోని పాక్ సైన్యాన్ని తరిమి కొట్టింది. జూలై 26 నాటికి పాక్ ఆక్రమించిన ప్రాంతాలన్నింటినీ భారత సైన్యం తన గుప్పిట్లోకి తెచ్చుకోగలిగింది. సుమారు 73 రోజలపాటు సాగిన యుధంలో అధికారిక లెక్కల ప్రకారం ఈ యుద్ధంలో 527 మంది భారత సైనికులు ప్రాణాలు అర్పించారు. పాక్ ఆర్మీకి కోలుకోలేని దెబ్బతగిలింది. శత్రుసైన్యాన్ని తరిమికొట్టే ప్రయత్నంలో అమరులైన జవాన్లను ఓసారి స్మరించుకుందాం.
జైహింద్... భారత్ మాతాకీ జై...
మూలం: బెస్ట్ సోషల్ టీచర్ వాట్సాప్ గ్రూప్స్ అడ్మిన్ కృష్ణారెడ్డి గారు

Previous
Next Post »
0 Komentar

Google Tags