Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Uses of Roti’s / phulkas

Uses of Roti’s / phulkas

చపాతీలు / పుల్కాలు
ఊబకాయంతో బాధపడేవారు, లావు తగ్గాలని కోరుకునే వారు రాత్రి సమయంలో అన్నం కు బదులు చపాతీలు / పుల్కాలు తినటానికి ఎక్కువ మంది ఇష్ట పడుతున్నారు. రాత్రి సమయంలో జీర్ణవ్యవస్థకు విశ్రాంతి ఇవ్వటం ఎంతైనా అవసరం. లేదంటే జీర్ణప్రక్రియ మందగిస్తోంది. వైద్యులు కూడా ఈ మధ్యకాలంలో చపాతీలు / పుల్కాలు తినమని సూచిస్తున్నారు.
చపాతీలు / పుల్కాలు తినేవారు తెలుసుకోవలసిన విషయాలు
*చపాతీని తక్కువ నూనెతో కాల్చడం మంచిది. అసలు నూనె వేయకుండా ఉంటే మరింత మంచిది.
*ప్లేటు నిండుగా భోజనం చేసినా రెండు లేదా మూడు చపాతీలు తిన్నా ఒక్కటే. అన్నం కంటే చపాతీ శరీరానికి అధిక శక్తినిస్తుంది.
*శక్తిని ఇస్తున్నంత మాత్రాన ఈ చపాతీల్లో కొవ్వు పదార్థాలు ఉండవు.  
*వాటిల్లో విటమిన్ బి,, కాపర్, అయోడిన్, జింక్, మాంగనీస్, సిలికాన్, మెగ్నీషియం & కాల్షియం వంటి ఎన్నో ఖనిజాలు ఉంటాయి.
*గోధుమల్లో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.
*పని ఒత్తిడిలో ఏ అర్ధరాత్రి భోజనం చేసి వెంటనే నిద్ర పోతుంటారు. కానీ ఈ విధంగా చేయడం ఆరోగ్యానికి హానికరం. భోజనం చేయడానికి, నిద్ర పోవడానికి మధ్య గ్యాప్ ఉంటే మంచిది. అలా చేయలేని వారికి చపాతీ తీసుకోవడం ఉత్తమం.
* ప్రతిరోజూ మోతాదుకు మించి తీసుకోవటం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

*ఉదయాన్నే అల్పాహారంగా తీసుకోవటంతో రోజంతా చురుకుగా ఉండవచ్చు. అవసరమైన న్యూట్రీషన్లు కూడా లభిస్తాయి.

Previous
Next Post »
0 Komentar

Google Tags