Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP More than 16,000 posts of vacancies in Secretariats

సచివాలయాల్లో 16 వేలకు పైగా పోస్టులు ఖాళీలు.. త్వరలో భర్తీ..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో నిరుద్యోగులకు  గుడ్ న్యూస్ అందించనున్నది. అసలు విషయానికి వస్తే తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఇటీవల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఉపాధి హామీ పనులు, గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఈ సమావేశంలో అధికారులు ఆగస్టు 31 నాటికి గ్రామ సచివాలయాల నిర్మాణం పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.  అలాగే వార్డు, గ్రామ సచివాలయాల్లో 16,208 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ముఖ్యమంత్రి జగన్ కు నివేదించిన అధికారులు, పరీక్షలకు అనుమతులు రాగానే భర్తీ చేస్తామని తెలిపారు.  అలాగే వచ్చే ఏడాది మార్చి 31 కల్లా రైతుభరోసా కేంద్రాలు,  ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణాలను పూర్తి చేస్తామని చెప్పారు.  పాఠశాలల్లో 'నాడు-నేడు'  కార్యక్రమాలు  జూలై 31వరకు పూర్తి చేస్తామన్నారు.
Previous
Next Post »
0 Komentar

Google Tags