Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Vitamin-D, which reduces the severity of Covid-19 and Death threat to people who do not have enough!



Vitamin-D, which reduces the severity Covid-19 
 Death threat to people who do not have enough!

కోవిడ్-19 తీవ్రత తగ్గించే విటమిన్-డి.. తగినంతలేని వ్యక్తులకే మరణం ముప్పు!

Coronavirus తో విటమిన్-డికి ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా.. మహమ్మారి మరణం ముప్పును తగ్గించడంలో ఇది కీీలక పాత్ర పోషిస్తోందని అనేక పరిశోధనలు వెల్లడించాయి.

దేశంలోని దాదాపు 80 శాతం మంది విటమిన్-డి లోపంతో బాధపడుతున్నారు. మానవ శరీర ముఖ్య విధుల్లో విటమిన్-డి కీలక పాత్ర పోషించింది. శరీరంలో డి-విటమిన్ తగినంత స్థాయిలో లేకపోవడం వల్ల ఎముకలు బలహీనపడతాయి, ఒళ్లు నొప్పులు, ఇతర ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని తగ్గిపోతుంది. వాస్తవానికి, ఈ విటమిన్ లోపం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ప్రస్తుతం కోవిడ్ -19తో పోరాటంలోనూ ఇది కీలకంగా వ్యవహరిస్తున్నట్టు పరిశోధనల్లో తేలింది.

విటమిన్-డి, కోవిడ్-19కు పరోక్ష సంబంధం ఉంది. కరోనా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్నవారిలో డి-విటమిన్ లోపించిన వ్యక్తులే ఉన్నట్టు పరిశోధనల్లో గుర్తించారు. కరోనా కారణంగా చాలా మంది ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్న ప్రస్తుత సమయంలో సరిపడేంత విటమిన్-డి శరీరానికి అవసరం. ఇళ్ల నుంచి బయటకు రాకపోవడంతో విటమిన్-డికి ప్రధాన వనరైన సూర్యకాంతికి దూరంగా ఉంటున్నారు.

కరోనా వైరస్ వ్యాప్తికి ముందు కూడా దేశంలో 80 శాతానికిపైగా ప్రజల్లో ఇన్‌ఫెక్షన్లతో పోరాడే విటిమిన్- డి లోపం ఉంది.. వైద్యులను సంప్రదించి దీని స్థాయిలను పరీక్షించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ‘విటమిన్ డి ఇమ్యునో-మాడ్యులేటర్.. అందువల్ల, సైటోకిన్ సంక్షోభాన్ని తగ్గించడంలో ఇది సహాకరిస్తుంది.. కోవిడ్ -19 వైరస్ తీవ్రతను తగ్గించే ACE2 గ్రాహకాలను కూడా ప్రోత్సహించి, ఊపిరితిత్తుల్లో మంటను తగ్గిస్తుంది... కాబట్టి, కోవిడ్-19 చికిత్సలో విటమిన్- డి చాలా అవసరం, కానీ విటమిన్ తీసుకోవడం వల్ల మరణాలు తగ్గుతాయని మేము చెప్పలేం

.. కరోనాకు చికిత్స బహుముఖంగా ఉంటుంది.. విటమిన్- సి లేదా యాంటీ వైరల్ స్టెరాయిడ్ల మాదిరి ముఖ్యమైంది. కోవిడ్ -19తో సంబంధం లేకుండా రోజుకు 2,000 యూనిట్లు విటమిన్- డి అవసరం. ఇది శరీరంలో ఏదైనా వ్యాధితో పోరాడటానికి సహాయపడుతుంది’ అని హెచ్‌సీఎఫ్ఐ, మెడ్‌టాక్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ డాక్టర్ కేకే అగర్వాల్ అన్నారు. 

అన్ని ఇన్ఫెక్షన్లతో పోరాటానికి విటమిన్-డి ముఖ్యమైంది.. కోవిడ్ -19 మాత్రమే కాదు.. మేని ఛాయ లేదా వేగవంతమైన పట్టణీకరణ కారణంగా చాలా మంది భారతీయులలో ఈ సూక్ష్మ పోషకం లోపం ఉంది.. ఈ పోషకాన్ని తయారు చేయగలిగే సమయంలో మనం ఎండలోకి వెళ్ళడం లేదు’ అంటూ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌ క్రిటికల్ అండ్ ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ ప్రవీణ్ కొప్పుల వ్యాఖ్యానించారు.

ఒక వ్యక్తికి దీర్ఘకాలం విటమిన్-డి తక్కువ స్థాయిలో ఉంటే శరీరం లోపల గ్రాహకాలు అస్పష్టంగా మారుతాయి.. శరీరంలో 32 నానోగ్రాముల విటమిన్ డి కంటే ఎక్కువ ఉంటే, కాల్షియం శోషణ, శరీరం పనితీరు మెరుగ్గా ఉంటుంది. అయినప్పటికీ, చాలా మందిలో స్థాయిలు 15- 25 నానోగ్రామ్‌ల మధ్య ఉంటాయి. గ్రాహకాలను సున్నితంగా చేయడానికి విటమిన్- డి ఇంజెక్షన్లను వైద్యులు సిఫారసు చేస్తారు.. ఎందుకంటే మాత్రలు శరీరంలో కలవడానికి ఎక్కువ సమయం పడుతుంది.

కరోనావైరస్ మన శరీరంలో ఎలా పనిచేస్తుందో మనకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు కూడా విరుద్ధమైన ప్రకటనలు చేశాయి. అందుకే, తెలిసిన అన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. సరైనస్థాయిలో విటమిన్- డి, తగినంత మంచి నిద్ర, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండటానికి సహకరిస్తుంది’ అని మరో వైద్యుడు అన్నారు. 

విటమిన్-డి లోపం ఉన్నవారికి ఎముకల బలహీనం, తలనొప్పి, జత్తు రాలిపోవడం, కండరాల నొప్పులు తలెత్తుతాయి. సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల ద్వారా శరీరానికి డి-విటమిన్ లభిస్తుంది. ప్రస్తుతం నగరాల్లో కాలుష్యం పెరిగిపోవడంతో ఈ కిరణాలు మానవ శరీరానికి చేరడానికి అనుమతించదు.

ఫెయిర్ స్కిన్ వ్యక్తికి అవసరమైన మొత్తంలో డి-విటమిన్ తయారికి సూర్యరశ్మిలో అరగంట ఉంటే సరిపోతుంది. ఎక్కువసేపు సూర్యకాంతిలో కూర్చుంటే ఈ విటమిన్‌ను ఎక్కువగా పొందుతామని భావిస్తాం. కానీ, విరుద్ధంగా, ఎక్కువసేపు ఉంటే అప్పటికే శరీరంలో ఏర్పడిన విటమిన్-డిని అస్థిరపరుస్తుంది. ముదురు రంగు చర్మం ఉన్నవారు, ఎండలో 45 నిమిషాలు ఉంటే సరిపోతుంది.
Previous
Next Post »
0 Komentar

Google Tags