Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Are there people who should not eat almonds?

 


Are there people who should not eat almonds?

ఈ మెడిసిన్ వాడుతున్నారా.. అయితే బాదం పప్పు తినొద్దు..

బాదంపప్పు ఆరోగ్యానికి మంచిది.. కానీ, కొంతమంది అస్సలు తినకూడదని చెబుతున్నారు నిపుణులు.. ఆ వివరాలు ఏంటో తెలుసుకోండి. 

కొంతమంది నట్ ఎలర్జీతో సతమతమవుతూ ఉంటారు. అటువంటి వారు బాదంపప్పులను తినకపోవడమే మంచిది. ఎందుకంటే, వారికి అలర్జీ వల్ల దద్దుర్లు, వాపు, అలాగే బ్రీతింగ్ ప్రాబ్లెమ్స్ వస్తాయి. నట్స్ ను తిన్న ప్రతిసారి వారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. అందుకే, వారు బాదంపప్పుకు దూరంగా ఉండటం మంచిది.

బాదంపప్పును ప్రపంచ వ్యాప్తంగా హెల్తీ ఫుడ్ గా గుర్తించారు. ఇందులో ప్రోటీన్, ఫైబర్, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం అలాగే విటమిన్ ఈ సమృద్ధిగా లభిస్తాయి. అలాగే బాదం గింజల నుంచి అనేక హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఇవి మీ స్కిన్ ను హెల్దీగా ఉంచుతాయి. హార్ట్ డిసీస్ బారిన పడే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. క్యాన్సర్ రిస్క్ ను కూడా తగ్గిస్తాయి. బ్లడ్ ప్రెజర్ లెవెల్స్ ను కూడా తగ్గిస్తాయి. 

హెల్త్ ఇష్యూస్:

అతిగా తీసుకుంటే హెల్తీ ఫుడ్ కూడా అనారోగ్య సమస్యలు తెచ్చిపెడుతుంది. ఈ కాన్సెప్ట్ బాదం గింజలకు కూడా వర్తిస్తుంది. ఈ డ్రై ఫ్రూట్ ను ఎక్కువగా తీసుకుంటే గ్యాస్ట్రో ఇంటస్టినల్ సమస్యలు వస్తాయి. అందుకే, కొంతమంది బాదం గింజలను పూర్తిగా అవాయిడ్ చేయాలి. కొంతమంది తమ ఆరోగ్య స్థితిని దృష్టిలో పెట్టుకుని బాదం గింజలను టెంపరరీగా అవాయిడ్ చేస్తే మంచిదంటున్నారు నిపుణులు. బాదం గింజలను ఎవరెవరు తినకూడదు? ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

కొన్ని స్పెసిఫిక్ మెడిసిన్స్ వాడుతున్నవారు:

లాక్సాటిప్స్ వాడుతున్నవారు, అలాగే యాంటీబయటిక్ మెడిసిన్స్ ను వాడుతున్నవారు తమ డైటీషియన్ ను సంప్రదించి అప్పుడు బాదం గింజలను తమ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. బాదం గింజల్లో మ్యాంగనీజ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. గుప్పెడు బాదం గింజల్లో దాదాపు 0.6 మిల్లీగ్రాముల మాంగనీస్ లభిస్తుంది. అంటే రోజువారి మాంగనీస్ రిక్వయిర్మెంట్ లో దాదాపు 27 శాతమనేది బాదం పప్పునుంచి గ్రహించవచ్చు. ఐతే, బాదంపప్పును ఎక్కువగా తీసుకుంటే మందుల ప్రభావం సరిగ్గా ఉండకపోవచ్చు. అంటే, మెడిసిన్స్ వల్ల కలిగి ఫలితాల్ని తగ్గించే అవకాశం ఉంది. కాబట్టి, కొన్ని ప్రత్యేకమైన మెడిసిన్స్‌ను వాడేవారు బాదంపప్పుకి దూరంగా ఉంటే మంచిది. 

నట్ ఎలర్జీ:

కొంతమంది నట్ ఎలర్జీతో సతమతమవుతూ ఉంటారు. అటువంటి వారు బాదంపప్పులను తినకపోవడమే మంచిది. ఎందుకంటే, వారికి అలర్జీ వల్ల దద్దుర్లు, వాపు, అలాగే బ్రీథింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నట్స్ ను తిన్న ప్రతిసారి వారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. అందుకే, వారు బాదంపప్పుకు దూరంగా ఉండటం మంచిది. అలాగే, కొంతమందిలో ఈ నట్ ఎలర్జీ వల్ల అనాఫిలాక్సిస్ సమస్య రావచ్చు. అంటే, అలర్జీ మరింత తీవ్రతరం కావచ్చు. ఇది ప్రాణాంతక సమస్య. అంతవరకూ తెచ్చుకునే బదులు సింపుల్‌గా బాదంపప్పును అవాయిడ్ చేస్తే సరిపోతుంది. 

మిగడంలో ఇబ్బంది పడేవారు:

చిన్నపిల్లలు అలాగే కొంతమంది పెద్దవారు మింగడంలో కొంత ఇబ్బందిపడతారు. వీరు నట్స్ ను అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే, నట్స్ వీరి గొంతులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. డిమెన్షియా, పార్కిన్సన్స్ డిసీజ్ అలాగే మొబిలిటీ తగ్గినవారు కూడా జాగ్రత్తగా ఉండాలి. 

విటమిన్ ఈ సప్లిమెంట్ తీసుకుంటున్నవారు:

బాదంపప్పులో విటమిన్ ఈ అధికంగా లభిస్తుంది. అంటే, 28 గ్రాముల బాదంపప్పులో దాదాపు 7.4 మిల్లీగ్రాముల విటమిన్ ఈ దొరుకుతుంది. మనకు ఈ విటమిన్ రోజుకు 15 మిల్లీగ్రాములు లభిస్తే సరిపోతుంది. అందుకే, ఎక్కువగా బాదంపప్పును తింటే అందులోనూ విటమిన్ ఈ సప్లిమెంట్ తీసుకుంటూ తింటే విటమిన్ ఈ ఓవర్ డోస్ అవుతుంది. దీని వల్ల బద్దకం, కళ్ళు మసక బారడం, విరేచనాలు, కడుపుబ్బరం వంటి సమస్యలు వస్తాయి. కేవలం ఈ సమస్యలతో ఇబ్బంది పడే వారు మాత్రమే కాదు. నార్మల్ గా ఉన్నవారు కూడా అతిగా బాదం గింజలను తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ కు గురవ్వాల్సి వస్తుంది. అతిగా బాదం గింజలను తింటే కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

1. మలబద్ధకం:

బాదంపప్పులో ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది. ఒక ఔన్స్ బాదంపప్పులో దాదాపు 3.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఫైబర్ ఒంటికి మంచిదే. ఐతే, అధికంగా ఫైబర్ ను తీసుకుంటే మాత్రం మంచిది కాదు. కాన్స్టిపేషన్ వస్తుంది. తగినంత నీటిని తాగకపోతే ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది. 

2. వెయిట్ గెయిన్:

ఒక ఔన్సు బాదంపప్పులో 164 కేలరీలుంటాయి. ఇది సమస్య కాదు. ఎప్పుడైతే మీరు ఎక్కువగా బాదంపప్పులను తింటారో అప్పుడు సమస్య వస్తుంది. రెగ్యులర్ డైట్ తో పాటు 20 కంటే ఎక్కువ బాదంపప్పులను తింటే వెయిట్ గెయిన్ అయ్యే సమస్య వస్తుంది. 

3. కిడ్నీ స్టోన్స్:

బాదంపప్పులో ఇంటస్టినల్ సాల్యుబుల్ ఆక్సలేట్స్ లభిస్తాయి. ఇవి కిడ్నీ స్టోన్స్ కు దారితీస్తాయి. అతిగా బాదంపప్పును తింటే కిడ్నీ స్టోన్స్ బారిన పడే ప్రమాదం ఉంది గనక వీటిని మితంగానే తీసుకుంటే మంచిది. 

4. టాక్సిన్స్ పెరుగుతాయి:

బాదంపప్పును ఎక్కువగా తీసుకుంటే శరీరంలో టాక్సిన్స్ మోతాదు పెరుగుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, నెర్వస్ బ్రేక్ డౌన్ వంటి సమస్యలు వస్తాయి. ఇది ప్రాణాంతక సమస్య కూడా. అందుకే, పాలిచ్చే తల్లులు అలాగే గర్భిణీలు బాదంపప్పును తీసుకోకూడదని వైద్యులు సూచిస్తున్నారు. 

బాదంపప్పును మితంగా తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు

బాదంపప్పును మోడరేట్ గా తీసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు. అవేంటో తెలుసుకుందాం. 

1. పోషకాలు పుష్కలంగా లభిస్తాయి:

బాదంపప్పులో న్యూట్రియెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఒక ఔన్స్ బాదంపప్పులో 3.5 గ్రాముల ఫైబర్, 6 గ్రాముల ప్రోటీన్, 14 గ్రాముల ఫ్యాట్ లభిస్తాయి. అలాగే , రికమెండెడ్ డైలీ ఇంటేక్ లో 37 శాతం విటమిన్ ఈ, 32 శాతం మ్యాంగనీజ్, 20 శాతం మెగ్నీషియం లభిస్తాయి. అలాగే బాదంపప్పులో తగినంత కాపర్, విటమిన్ బి2, అలాగే ఫాస్ఫరస్ కూడా ఉంటాయి. ఇందులో 161 కేలరీలు, 2.5 గ్రాముల డైజెస్టబుల్ కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి. 

2. యాంటీ ఆక్సిడెంట్స్:

ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి యాంటీ ఆక్సిడెంట్స్ ప్రొటెక్ట్ చేస్తాయి. బాదంపప్పులో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా లభిస్తాయి. బాదంపప్పు బ్రౌన్ స్కిన్ లోనే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. కాబట్టి, పీల్ చేసిన బాదంపప్పును తింటే యాంటీ ఆక్సిడెంట్స్ లభించవు. 

3. బ్లడ్ షుగర్ ను అలాగే బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేస్తుంది:

బాదంపప్పులో కార్బ్స్ తక్కువగా ఉంటాయి. హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే, ప్రోటీన్ తో పాటు ఫైబర్ కూడా ఇందులో ఎక్కువే. అందుకే, డయాబెటిక్స్ కు ఇది మంచి మందు. ఇందులో మెగ్నీషియం ఎక్కువగా లభిస్తుంది. ఈ మినరల్ డయాబెటిక్స్ కు ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిక్ పేషంట్స్ కు హెల్ప్ చేస్తుంది. అదే సమయంలో, ఈ మినరల్ బ్లడ్ ప్రెజర్ ను కూడా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి, హై బ్లడ్ ప్రెజర్ తో బాధపడేవారు బాదంపప్పుతో ప్రయోజనం పొందవచ్చు.

మొత్తానికి బాదంపప్పును మితంగానే తీసుకుంటేనే మంచిదని నిపుణులు అంటున్నారు. అలాగే, ఒకవేళ బాదంపప్పును అవాయిడ్ చేసే కేటగిరీలోకి మీరు వస్తే బాదంపప్పును అవాయిడ్ చేయడమే ఉత్తమం. సందేహాలుంటే డైటీషియన్ సూచనలను పాటించండి.

Previous
Next Post »
0 Komentar

Google Tags