Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Jagananna Vidyakanuka on Oct 8th


Jagananna Vidyakanuka on Oct 8th
8న జగనన్న విద్యా కానుక
జగనన్న విద్యా కానుకను ఈనెల 8న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయకుమార్‌ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం మొత్తం 42,34,322 మంది విద్యార్థులకు దాదాపు రూ.650 కోట్ల వ్యయంతో జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ చేయనుందని వెల్లడించారు. ప్రభుత్వ యాజమాన్యంలోని అన్ని రకాల పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ కిట్లు అందజేస్తారని వివరించారు. ప్రతి కిలో 3 జతల యూనిఫారాలు, ఒక జత బూట్లు, 2 జతల సాక్సులు, బెల్టు, ఒక సెట్ పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, ఒక స్కూల్ బ్యాగ్ ఉంటాయని తెలిపారు.
Previous
Next Post »
0 Komentar

Google Tags