Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS EAMCET-2020 Counselling‌ Schedule Finalized


TS EAMCET-2020 Counselling‌ Schedule Finalized
ఎంసెట్‌-2020 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఖరారు.. తేదీలు ఇవే..!
తెలంగాణ ఎంసెట్ పరీక్షల ఫలితాలను రేపు (అక్టోబర్‌ 6) విడుదల చేయనున్న నేపథ్యంలో కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను ప్రకటించారు.

తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఖరారైంది. తెలంగాణ ఎంసెట్ పరీక్షల ఫలితాలను రేపు (అక్టోబర్‌ 6) విడుదల చేయనున్న నేపథ్యంలో కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను ప్రకటించారు. కరోనా కారణంగా ఈ ఏడాది ఎంసెట్‌ నిర్వహణ ఆలస్యమైంది. సెప్టెంబర్‌లో నాలుగు రోజుల పాటు రెండు సెషన్లలో పరీక్షను నిర్వహించారు. 1లక్ష43 వేల165 మంది ప‌రీక్షకు దరఖాస్తు చేసుకున్నారు.

షెడ్యూల్‌ ఇలా:
ఈ నెల 9వ తేదీ నుంచి 17 వరకు ఆన్‌లైన్‌లో స్లాట్ల నమోదు చేసుకోవచ్చు.
ఈ నెల 12 నుంచి 18 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలించనున్నారు.
ఈ నెల 12 నుంచి 20 వరకు ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్లు పెట్టుకునే అవకాశం ఉంది.
ఈ నెల 22న మొదటి విడత ఇంజినీరింగ్‌ సీట్లను కేటాయించనున్నారు.
ఈ నెల 29 నుంచి ఎంసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ జరుగనుంది.
30న తుది విడత ధ్రువపత్రాల పరిశీలిస్తారు.
30, 31 తేదీల్లో తుది విడత ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.
నవంబర్‌ 2న ఇంజినీరింగ్‌ తుది విడత సీట్ల కేటాయించనున్నారు.
నవంబర్‌ 4న స్పాట్‌ అడ్మిషన్ల మార్గదర్శకాలను అధికారులు విడుదల చేయనున్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags