Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP SLPRB Recruitment - 2020 Notification Released

 


AP SLPRB Recruitment 2020 Notification Released

ఏపీ పోలీసు నియామక బోర్డు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ 58 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (APSLPRB) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీలో 58 సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఫిజికల్, కెమికల్, బయాలజీ లేదా సెరాలజీలో ఈ పోస్టులున్నాయి. ఇందులో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా 57 పోస్టులున్నాయి. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 2న ప్రారంభమైంది. నవంబర్ 22 దరఖాస్తుకు చివరి తేదీ. 

ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ http://slprb.ap.gov.in/ లో చూడొచ్చు. 

మొత్తం ఖాళీలు: 58

సైంటిఫిక్ అసిస్టెంట్ (ఫిజికల్)- 18

సైంటిఫిక్ అసిస్టెంట్ (కెమికల్)- 17

సైంటిఫిక్ అసిస్టెంట్ (బయాలజీ లేదా సెరాలజీ)- 22

సైంటిఫిక్ అసిస్టెంట్ (కెమికల్) లిమిటెడ్ రిక్రూట్‌మెంట్- 1 

ముఖ్య సమాచారం:

విద్యార్హతలు: పోస్టులను బట్టి వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో చూడొచ్చు.

దరఖాస్తు ప్రారంభం: నవంబర్ 2, 2020

దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 22 సాయంత్రం 5 గంటల వరకు

రాతపరీక్ష: డిసెంబర్ 6 ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు

దరఖాస్తు ఫీజు: రూ.600. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.300

వెబ్‌సైట్‌: http://slprb.ap.gov.in/

NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags