Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

This is what RBI has to say about old Rs 100 notes going out of circulation by March

 

This is what RBI has to say about old Rs 100 notes going out of circulation by March

మార్చి నాటికి చెలామణిలో ఉన్న పాత రూ .100 నోట్ల గురించి ఆర్‌బిఐ చెప్పేది ఇదే

మీరు పాత రూ.100 నోట్లు, రూ.10 నోట్లు, రూ.5 నోట్లను ఇంట్లో దాచుకుంటున్నారా? 

సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతోందా? మరోసారి కరెన్సీ నోట్లపై కీలక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతోందా? ఈసారి పాత రూ.100 నోట్లు, రూ.10 నోట్లు, రూ.5 నోట్లు లక్ష్యంగా నిర్ణయం ఉండబోతోందా? పాత రూ.500 నోట్లు, రూ.1,000 నోట్ల మాదిరిగానే రానున్న రోజుల్లో పాత రూ.వంద, రూ.10, రూ.5 నోట్లు కనిపించవా? 

వెలువడుతున్న నివేదికలను గమనిస్తే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI పాత రూ.100 నోట్లను వ్యవస్థ నుంచి తొలగించేందుకు రెడీ అవుతోందని పలు నివేదికలు వెల్లువడ్డాయి. కేంద్ర బ్యాంక్ పాత రూ.100, రూ.10, రూ.5 నోట్లను మార్చి లేదా ఏప్రిల్ కల్లా వ్యవస్థ నుంచి వెనక్కి తీసుకోవాలని ఆలోచిస్తోందని ఆర్‌బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బి మహేశ్ చెప్పినట్లుగా నివేదికలు పేర్కొంటున్నాయి. 

పాత రూ.100 నోట్లు, రూ.10 నోట్లు, రూ.5 నోట్లు క్రమానుగతంగా వ్యవస్థ నుంచి కనుమరుగు అవుతాయని ఆయన చెప్పినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. మార్చి లేదా ఏప్రిల్ నాటికి ఆర్‌బీఐ ఈ నోట్లను వెనక్కి తీసుకుంటుందని ఆయన పేర్కొన్నట్లు తెలిపాయి.

ఇకపోతే రూ.10 నాణేలపై కూడా ఈయన స్పందించినట్లు తెలుస్తోంది. నివేదిక ప్రకారం.. రూ.10 నాణేలను తీసుకువచ్చి 15 ఏళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ ట్రేడర్లు, వ్యాపారులు కొన్ని చోట్ల ఈ కాయిన్స్ తీసుకోవడం లేదని బి మహేశ్ పేర్కొన్నారు. దీని వల్ల బ్యాంకులకు, ఆర్‌బీఐకి సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. బ్యాంకుల్లో రూ.10 నాణేలు చాలానే ఉన్నాయని పేర్కొన్నారు. 

రూ.10 నాణేలు చెల్లుబాటు అవుతాయని బి మహేశ్ తెలిపారు. దీని వ్యాలిడిటీపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా రూ.100, రూ.10, రూ.5 నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయని, ఒకేసారి వీటిని రద్దు చేయరని, క్రమంగా వీటిని మార్కెట్ నుంచి ఆర్‌బీఐ తొలగిస్తుందని వివరించారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags