Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: 10 వ తరగతి విద్యార్థులకు మే నెల మొత్తం వేసవి సెలవులు - పరీక్షల షెడ్యూల్ యధాతధం

 

AP: 10 వ తరగతి విద్యార్థులకు మే నెల మొత్తం వేసవి సెలవులు - పరీక్షల షెడ్యూల్ యధాతధం

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి 31 వరకు పదో తరగతి విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించింది.

షెడ్యూల్ ప్రకారం జూన్ 7 నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. పదో తరగతి విద్యార్థులకు సిలబస్ మొత్తం పూర్తి అయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈనెల 30కి జూనియర్ కళాశాలలు, పదోతరగతి వారికి చివరి వర్కింగ్ డేగా పేర్కొన్నారు.

పదో తరగతి వారికి సిలబస్ మొత్తం పూర్తయిన నేపథ్యంలో మే 1 నుంచి 31 వరకు వేసవి సెలవులు ప్రకటించినట్లు పేర్కొన్నారు. జూన్ 1 నుంచి ఉపాధ్యాయులు పాఠశాలలకు వచ్చి షెడ్యూల్ మేరకు జూన్ 7 నుంచి జరిగే 10వ తరగతి పరీక్షలకు సిద్ధం కావాలని తెలిపారు. సెలవుల్లో విద్యార్థులు ఇంటి పట్టునే ఉండి పరీక్షలకు బాగా సన్నద్ధం కావాలని మంత్రి సూచించారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags