Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SJVN Ltd Recruitment 2021: Apply for 129 Field Officer & Engineer Posts

 

SJVN Ltd Recruitment 2021: Apply for 129 Field Officer & Engineer Posts

ఎస్‌జే‌వి‌ఎన్ లో 129 ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులు

భారత ప్రభుత్వ విద్యుచ్ఛక్తి మంత్రిత్వ శాఖకి చెందిన మినీరత్న సంస్థ అయిన హిమాచల్‌ ప్రదేశ్ లోని ఎస్ జేవీఎన్ లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 129

1) ఫీల్డ్ ఆఫీసర్లు: 20

విభాగాల వారీగా ఖాళీలు: హ్యూమన్ రిసోర్స్-10, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్-10.

అర్హత: గ్రాడ్యుయేషన్ తో పాటు ఎంబీఏ/ పీజీ డిప్లొమా, నీఏ/ ఐసీడబ్ల్యూఏ-సీఎంఏ/ ఎంబీఏ (ఫైనాన్స్) ఉత్తీర్ణత.

2) జూనియర్ ఫీల్డ్ ఇంజినీర్లు: 75

విభాగాల వారీగా ఖాళీలు: సివిల్-30, ఎలక్ట్రికల్-25, మెకానికల్-20.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్ టైం ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.

3) జూనియర్ ఫీల్డ్ ఆఫీసర్లు: 34

విభాగాల వారీగా ఖాళీలు: హ్యూమన్ రిసోర్స్-15, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్-15, అఫీషియల్ లాంగ్వేజ్-04. అర్హత: గ్రాడ్యుయేషన్ తో పాటు ఫుల్ టైం పీజీ/ పీజీ డిప్లొమా, ఇంటర్ సీఏ/ ఇంటర్ సీఎంఏ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: దరఖాస్తు చివరి తేది నాటికి 30 ఏళ్లు మించకుండా ఉండాలి.

జీతభత్యాలు: ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులకి నెలకి రూ.60000, జూనియర్ ఫీల్డ్ ఇంజినీర్, జూనియర్ ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులకి నెలకి రూ.45000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. జూనియర్ ఫీల్డ్ ఇంజినీర్/ జూనియర్ ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా మాత్రమే ఎంపిక విధానం ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.08.2021.

దరఖాస్తులకి చివరి తేది: 24.08.2021.

APPLY HERE

NOTIFICATION

WEBSITE 

Previous
Next Post »
0 Komentar

Google Tags