Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

JioPhone Next on Sale: Price, Offers, Specifications – Details Here

 

JioPhone Next on Sale: Price, Offers, Specifications – Details Here

అందుబాటులోకి జియో ఫోన్‌ నెక్స్ట్‌ - ధర మరియు కొనుగోలు వివరాలు ఇవే

జియో ఫోన్‌ నెక్స్ట్స్‌ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. రిలయన్స్‌ డిజిటల్‌ ఆన్‌లైన్‌ స్టోర్లలో ఈ ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు ఈ ఫోన్‌ కొనుగోలు చేయాలంటే రిజిస్టర్‌ చేసుకోవడం తప్పనిసరి. ఇకపై అలాంటిదేమీ లేకుండా నేరుగా కొనుగోలు చేయొచ్చు. రిలయన్స్‌ డిజిటల్‌ ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి రూ.6,499 చెల్లించి ఈ ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు. నలుపు, నీలం రంగుల్లో ఈ ఫోన్‌ లభ్యమవుతోంది. క్యాష్‌ ఆన్‌ డెలివరీ సదుపాయం లేదు. 

ఒకవేళ మీరు నగరాల్లో ఉన్నట్లయితే.. కొద్ది గంటల్లోనే ఈ ఫోన్‌ను డెలివరీ చేయనున్నారు. లేదంటే మీ దగ్గర్లోని రిలయన్స్‌ డిజిటల్‌ స్టోర్‌కి వెళ్లి ఈ ఫోన్‌ను తీసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల వారికి సాధారణ డెలివరీ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఇక ఈ ఫోన్‌ స్పెసిఫికేషన్స్‌ విషయానికొస్తే... గూగుల్‌తో భాగస్వామ్యంతో జియో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. 5.45 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేతో కార్నింగ్‌ గొరిల్లా 3 ప్రొటెక్షన్‌తో వస్తోంది. ప్రగతి ఓఎస్‌ పేరిట కస్టమైజ్‌ చేసిన ఆండ్రాయిడ్‌ 11 (గో ఎడిషన్‌) ఓఎస్‌తో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. స్నాప్‌డ్రాగన్‌ 215 క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌, 2జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ సదుపాయం ఉంది. ఈ ఫోన్‌ను తొలుత రూ.1999 చెల్లించి మిగిలిన మొత్తాన్ని ఈఎంఐ రూపంలో చెల్లించొచ్చు. ఇందుకోసం వివిధ ప్లాన్లను జియో అందుబాటులోకి తెచ్చింది. 

BUYING LINK 1

BUYING LINK 2

PAYMENT DETAILS LINK


Previous
Next Post »
0 Komentar

Google Tags