Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UNWTO selects Pochampally in Telangana as one of the best Tourism Villages

 

UNWTO selects Pochampally in Telangana as one of the best Tourism Villages

ప్రపంచ ఉత్తమ పర్యాటక గ్రామంగా భూదాన్ పోచంపల్లి - ఐరాస ప్రపంచ పర్యాటక సంస్థ ఎంపిక

తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లికి అరుదైన గౌరవం లభించింది. చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన  పోచంపల్లిని ఉత్తమ పర్యాటక కేంద్రంగా ఐరాస ప్రపంచ పర్యాటక సంస్థ ఎంపిక చేసింది. డిసెంబరు 2న స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో జరిగే కార్యక్రమంలో అవార్డు ప్రదానం చేయనున్నారు. భూదాన ఉద్యమంతో ఈ గ్రామం భూదాన్‌ పోచంపల్లిగా ప్రసిద్ధి చెందింది. ఇదిలా ఉంటే, ఉత్తమ పర్యాటక గ్రామం కేటగిరి కింద భారత్‌ నుంచి మూడు గ్రామాలు ఎంపికయ్యాయి. తెలంగాణలోని పోచంపల్లితోపాటు మధ్యప్రదేశ్‌లోని లాధ్‌పురా ఖాస్‌, మేఘాలయాలోని కోంగ్‌తాంగ్‌ గ్రామాలు నామినేట్‌ అయ్యాయి. వీటిని పరిశీలించిన ఐరాస పర్యాటక సంస్థ.. పోచంపల్లిని ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేసింది. 

ఉత్తమ పర్యాటక గ్రామంగా పోచంపల్లి ఎంపిక కావడం పట్ల రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (UNWTO) అవార్డును సొంతం చేసుకున్న సందర్భంగా పోచంపల్లి ప్రజలకు కేటీఆర్‌ అభినందనలు తెలిపారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags