Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Ola Electric Commences Deliveries of S1 Electric Scooters

 

Ola Electric Commences Deliveries of S1 Electric Scooters

ఓలా ఎలక్ట్రిక్‌: విద్యుత్తు స్కూటర్ల డెలివరీ ప్రారంభం

తమ విద్యుత్తు స్కూటర్ల డెలివరీ ప్రారంభించినట్లు ఓలా ఎలక్ట్రిక్‌ బుధవారం వెల్లడించింది. బెంగళూరు, చెన్నైలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఎస్‌1, ఎస్‌1 ప్రోలను తొలి 100 మంది కొనుగోలుదార్లకు అందించినట్లు పేర్కొంది.

‘ఓలా ఎస్‌1 డెలివరీలు ప్రారంభించడంతో మరో మైలురాయికి చేరుకున్నాం. ఓలా ఫ్యూచర్‌ ఫ్యాక్టరీలో స్కూటర్ల ఉత్పత్తిని వేగవంతం చేసి వినియోగదార్లకు ఇంతకుముందు తెలిపిన డెలివరీ సమయానికి అందిస్తామ’ని ఓలా ఎలక్ట్రిక్‌ ముఖ్య మార్కెటింగ్‌ అధికారి వరుణ్‌ దూబే వెల్లడించారు.

తమిళనాడులోని తయారీ ప్లాంట్‌లో ఓలా ఎస్‌1 స్కూటర్లను కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. ఎస్‌1 ధర రూ.99,999 కాగా ఎస్‌1 ప్రో ధర రూ.1,29,999గా ఉంది.

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags