Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

JEE Advanced 2022: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ -2022 పరీక్ష షెడ్యూల్‌ విడుదల

 

JEE Advanced 2022: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ -2022 పరీక్ష షెడ్యూల్‌ విడుదల

జులై 3న జేఈఈ అడ్వాన్స్‌డ్, జూన్‌ 8 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ బ్రోచర్‌ విడుదల

ఏప్రిల్‌ 2, మే 4వ వారంలో మెయిన్‌ పరీక్షలు!

ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి ఈసారి జులై 3న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష (ఆన్‌లైన్‌లో) నిర్వహించనున్నారు. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించే విద్యార్థులు ఆ పరీక్షకు జూన్‌ 8 నుంచి 14 వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2022 నిర్వహిస్తున్న ఐఐటీ బాంబే గురువారం సమగ్ర వివరాలతో బ్రోచర్‌ విడుదల చేసింది. పరీక్ష ఫలితాలను జులై 18న వెల్లడిస్తారు. ఆ మరుసటి రోజు నుంచి సీట్ల భర్తీకి జోసా కౌన్సెలింగ్‌ మొదలవుతుంది.

బాలికలకు 20% సీట్లు

* ఈసారి ప్రతి ఐఐటీలో కనీసం 20 శాతం సీట్లను సూపర్‌ న్యూమరరీ కింద బాలికలకు కేటాయిస్తారు.

* 2020, 2021లో అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు పేరు నమోదు చేసుకొని పరీక్ష రాయలేకపోయిన వారు ఈసారి నేరుగా జేఈఈ మెయిన్‌ రాయకుండానే అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు హాజరుకావొచ్చు.

* అడ్వాన్స్‌డ్‌లో కనీస మార్కులు సాధించిన వారు ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ పరీక్ష రాయవచ్చు. అందుకు జులై 18, 19 తేదీల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. పరీక్షను అదే నెల 21న నిర్వహిస్తారు. ఫలితాలను 24న వెల్లడిస్తారు.

తెలంగాణలో పరీక్ష కేంద్రాలు

ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, కోదాడ, మహబూబ్‌నగర్‌, మెదక్‌, నల్గొండ, నిజామాబాద్‌, పాల్వంచ, సత్తుపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్‌.

ఆంధ్రప్రదేశ్‌లో పరీక్ష కేంద్రాలు

అమలాపురం, అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుడ్లవల్లేరు, గూడూరు, గుంటూరు, కడప, కావలి, కర్నూలు, మచిలీపట్నం, మార్కాపురం, మైలవరం, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమహేంద్రవరం, సూరంపాలెం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం.

INFORMATION BROCHURE

CLICK FOR SCHEDULE

REGISTRATION FEE DETAILS

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags