Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Telangana Budget-2022 – Check the Highlights Here

 

Telangana Budget-2022 – Check the Highlights Here

తెలంగాణ బడ్జెట్‌-2022 ముఖ్యాంశాలు ఇవే

తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు. ‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన అనతికాలంలోనే దేశంలోకెల్లా అగ్రగామి రాష్ట్రంగా రూపుదాల్చింది. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారథ్యంలో స్వరాష్ట్ర స్వప్పం సాకారమైంది’ అని హరీశ్‌ రావు తన బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించారు.

బడ్జెట్‌ ముఖ్యాంశాలు..

రూ.2.56 లక్షల కోట్లతో బడ్జెట్‌

రెవెన్యూ వ్యయం రూ.1.89 లక్షల కోట్లు

క్యాపిటల్‌ వ్యయం రూ.29,728 కోట్లు

దళిత బంధుకు రూ.17,700 కోట్లు

పల్లె ప్రగతి ప్రణాళికకు రూ.330 కోట్లు

పట్టణ ప్రగతి ప్రణాళికకు రూ.1,394 కోట్లు

కొత్త వైద్య కళాశాలలకు రూ.వెయ్యి కోట్లు..

అటవీ విశ్వవిద్యాలయానికి రూ.100 కోట్లు

మెదక్‌, మేడ్చల్‌, రంగారెడ్డి, ములుగు, నారాయణపేట, గద్వాల, యాదాద్రిలో వైద్య కళాశాలలు

కేంద్రం రాష్ట్రం పట్ల చిన్న చూపు చూస్తోంది. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలకు నిధులు అడిగినా కేంద్రం ఇవ్వలేదు.

రూ.50 వేల లోపు రైతు రుణాలు మార్చిలోపు మాఫీ

వచ్చే ఆర్థిక ఏడాది రూ.75 వేల లోపు సాగు రుణాలు మాఫీ..

రాష్ట్రంలో పన్ను ఆదాయం 1,08,211.93 కోట్లు. కేంద్ర పన్నుల్లో వాటా 18,394.11 కోట్లు. పన్నేతర ఆదాయం 25,421.63 కోట్లు. గ్రాంట్లు 41,001.73 కోట్లు. రుణాలు 53,970 కోట్లు

₹ 2022-23 నాటికి మొత్తం అప్పులు 3,29,998 కోట్లు. జీఎస్డీపీలో 25 శాతం.

పంట రుణాలు రూ.16,144 కోట్లు మాఫీ..

రాష్ట్రంలో పామాయిల్‌ సాగుకు ప్రోత్సాహం. పామాయిల్‌ సాగుకు రూ.వెయ్యి కోట్లు. రాష్ట్రంలో 2.5 లక్షల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగు లక్ష్యం.

  సొంత స్థలంలో 2 పడకల ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం. సొంత స్థలం ఉన్న 4 లక్షల మందికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం.

అమ్మకం పన్ను అంచనా 33,000 కోట్లు. ఎక్సైజ్ ద్వారా ఆదాయం 17,500 కోట్లు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం 15,600 కోట్లు.

వ్యవసాయ రంగానికి రూ.24,254 కోట్లు

హరితహారానికి రూ.932 కోట్లు

సడలించిన వయోపరిమితి ప్రకారం కొత్త లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు. ఆసరా పింఛన్లకు రూ.11,728 కోట్లు.

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలకు రూ.2,750 కోట్లు

బ్రాహ్మణ సంక్షేమానికి రూ.177 కోట్లు.

రోడ్ల మరమ్మతులు, బీటీ రెన్యువల్‌ నిర్వహణ గ్రాంట్‌ రూ.1,542 కోట్లు.

పోలీసు శాఖకు రూ.9,315 కోట్లు..

యాదాద్రి తరహాలో పుణ్యక్షేత్రాల అభివృద్ధి..

గిరిజన గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణానికి రూ.600 కోట్లు.

ఎస్టీ సంక్షేమానికి రూ.12,565 కోట్లు.

బీసీ సంక్షేమానికి రూ.5,698 కోట్లు.

Previous
Next Post »
0 Komentar