Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

US Open Women’s Final 2022: Swiatek Beats Jabeur to Claim Third Grand Slam Title

 

US Open Women’s Final 2022: Swiatek Beats Jabeur to Claim Third Grand Slam Title

యుఎస్ ఓపెన్ మహిళల ఫైనల్ 2022: మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకున్న స్విటెక్

మహిళల యూఎస్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ ను పోలెండ్ కు చెందిన ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి ఇగా స్వైటెక్ దక్కించుకొంది. శనివారం అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం) ఆర్థర్ ఆషే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఆమె ప్రత్యర్థి ట్యునీసియాకు చెందిన జాబెర్ పై 6-2, 7-6, (7-5) తేడాతో విజయం సాధించింది. దీంతో స్వైటిక్ తన కెరీర్ లో మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్ ను సాధించినట్లైంది.

ఆమె 2020, 2022లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లను గెలుచుకొన్నారు. తాజా విజయంతో ఆమె ప్రపంచ నం.1 ర్యాంక్ ను మరింత బలోపేతం చేసుకుంది.

* గత కొన్ని నెలలుగా ఉక్రెయిన్ కు మద్దతుగా స్వైటెక్ తన టోపీ పై ప్రత్యేకమైన రిబ్బన్ ధరించి బరిలోకి దిగింది. ఆమె గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ మ్యాచ్ ల్లో ఈ విధంగా చేస్తోంది.

* ఈ టైటిల్ సాధించిన తొలి పోలెండ్ క్రీడాకారిణిగా స్వైటెక్ ఘనతను సాధించింది.

* ఈ ఏడాది ఆమె మూడు సార్లు గ్రాండ్ స్లామ్ సెమీస్ కు చేరగా రెండు సార్లు టైటిళ్లను సాధించింది. సెమీస్ కు చేరిన వాటిల్లో ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ టోర్నీలు ఉన్నాయి.

* ఒక టాప్ సీడెడ్ క్రీడాకారిణి యూఎస్ ఓపెన్ టైటిల్ గెలవడం 8 ఏళ్ల తర్వాత ఇదే. 2014లో సెరీనా విలియమ్స్ టాప్ సీడెడ్ క్రీడాకారిణిగా బరిలోకి దిగి ఈ టైటిల్ ను అందుకొన్నారు.

* ఈ సీజన్లో ఆమె ఒక దశలో వరుసగా 37 మ్యాచ్ ఓటమిని చవిచూడలేదు. వింబుల్డన్ మూడో రౌండ్లో ఈ జైత్రయాత్రకు అడ్డుకట్టపడింది.

* హార్డ్ కోర్ట్ టోర్నీల్లో స్వైటెక్ ఆటతీరు చాలా బలంగా ఉంటుంది. ఈ రకం కోర్టుల పై నాలుగు WTA 1000 టైటిళ్లలో విజయం సాధించి సన్ షైన్ డబుల్ ను సాధించిన 4వ క్రీడాకారిణిగా నిలిచింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags