Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

WhatsApp Introduces Screen Sharing During Video Calls

 

WhatsApp Introduces Screen Sharing During Video Calls

వాట్సాప్: వీడియో కాల్స్ సమయంలో స్క్రీన్ షేరింగ్‌ చేసే కొత్త ఫీచర్ – వివరాలు ఇవే

==========================

మనం నిత్యం వినియోగించే వాట్సాప్ తో స్క్రీన్ షేర్ చేసే వెసులుబాటు వచ్చేసింది. వాట్సాప్ వీడియో కాల్ సమయంలో స్క్రీన్ షేర్ చేసుకొనే సౌలభ్యాన్ని తీసుకొచ్చినట్లు మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఫేస్బుక్ ద్వారా తెలిపారు. అయితే ఈ ఫీచర్ ని ఎలా వినియోగించాలి. స్కీన్ షేరింగ్ తో పాటూ వాట్సాప్ తీసుకొచ్చిన మరో ఫీచర్లపై ఓ లుక్కేద్దాం. వాట్సాప్ వీడియో కాల్ వినియోగిస్తున్నప్పుడే ఈ స్క్రీన్ పై షేర్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ట్యాప్ చేయటం ద్వారా ఈ ఫీచర్ ను ఉపయోగించవచ్చు.

ఈ ఆప్షన్ సాయంతో మీకు నచ్చిన వాళ్లకు మీ స్క్రీన్ షేర్ చేయవచ్చు. అయితే స్క్రీన్ షేరింగ్ సమయంలో అన్ని యాప్ లు వినియోగించటానికి అనుమతి ఉండదు. భద్రత రీత్యా కొన్ని అప్లికేషన్లను మాత్రమే షేర్ చేయొచ్చు. మొబైల్లో ఏదైనా ఫీచర్ ని ఎలా వినియోగించాలో తెలియజేయాలనుకున్నప్పుడో.. ఏదైనా డాక్యుమెంట్ వర్క్ గురించో చర్చించాలనుకున్నప్పుడు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

వాట్సాప్ వీడియో కాల్స్ స్క్రీన్ షేరింగ్ తో పాటూ మరో ఫీచర్ ను తీసుకొచ్చింది. అదే ల్యాండ్స్కేప్ మోడ్. సాధారణంగా వీడియో కాల్ మాట్లాడుతున్న సమయంలో పోట్రైట్ మోడ్ మాత్రమే ఉండేది. ఇప్పడు ఈ ఫీచర్ వెడల్పుగా చిత్రాన్ని తిలకించొచ్చు. ప్రస్తుతం వాట్సాప్ బీటా యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు కూడా అందుబాటులోకి రానుందని వాట్సాప్ తెలిపింది.

==========================

Previous
Next Post »
0 Komentar

Google Tags