Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

The Nobel Prize 2023: Claudia Goldin Awarded Nobel Prize in Economic Sciences

 

The Nobel Prize 2023: Claudia Goldin Awarded Nobel Prize in Economic Sciences

శ్రామిక రంగంలో మహిళల భాగస్వామ్యానికి సంబంధించి సమగ్రమైన అధ్యయనానికిగానూ క్లాడియా గోల్డిన్ కు ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతి

=======================

2023 నోబెల్ పురస్కారాల చివరి రోజు అర్థశాస్త్రం లో పురస్కారాన్ని ప్రకటించారు.  అమెరికాకు చెందిన ఆర్థికవేత్త, హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ క్లాడియా గోల్డిన్ కు లభించింది. శ్రామిక రంగంలో మహిళల భాగస్వామ్యానికి సంబంధించి సమగ్రమైన అధ్యయనానికిగానూ గోల్డెన్ (77)ను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. అర్ధశాస్త్రంలో నోబెల్ పురస్కారం అందుకున్న మహిళల్లో గోల్డెన్ మూడో వ్యక్తి కావడం విశేషం.

అనేక అధిక ఆదాయ దేశాల్లో వేతన మహిళల నిష్పత్తి మూడు రెట్లు పెరిగింది. ఆధునిక కాలంలో కార్మిక రంగంలో ఇది అతిపెద్ద సామాజిక, ఆర్థిక మార్పుల్లో ఒకటి. అయితే, స్త్రీ- పురుష అంతరాలు అలాగే ఉన్నాయి! మహిళల సంపాదనతోపాటు ఈ వ్యత్యాసాల మూలాలను వివరించేందుకు క్లాడియా గోల్డిన్ సమగ్ర అధ్యయనం చేశారు. క్లాడియా గోల్డెన్ పరిశోధనలు.. లేబర్ మార్కెట్లో మహిళల చారిత్రక, సమకాలీన పాత్రలపై ఎప్పటికప్పుడు సరికొత్త, ఆశ్చర్యకరమైన వివరాలను అందించాయి' అని నోబెల్ కమిటీ తెలిపింది.

'శ్రామిక రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని అర్థం చేసుకోవడం సమాజానికి ఎంతో ముఖ్యం. ఈ రంగంలో క్లాడియా గోల్డెన్ సాగించిన పరిశోధనలకు ధన్యవాదాలు. వాటి ద్వారా అంతర్లీన కారకాలు, భవిష్యత్తులో ఏ సవాళ్లకు పరిష్కారాలు కనుగొనాలో మనకు మరింత తెలిసింది' అని అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి కమిటీ ఛైర్మన్ జాకోబ్ స్వెన్సన్ పేర్కొన్నారు. క్లాడియా గోల్డెన్ 1946లో న్యూయార్క్ లో జన్మించారు. షికాగో యూనివర్సిటీ నుంచి పీహెచ్సీ పట్టా పొందారు. ప్రస్తుతం కేంబ్రిడ్జ్ ని హార్వర్డ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఇప్పటికే వైద్య, భౌతిక, రసాయన శాస్త్రాలు, సాహిత్యం, శాంతి విభాగాల్లో నోబెల్ పురస్కారాలు ప్రకటించారు. గతేడాది అర్థశాస్త్రంలో అమెరికాకు చెందిన బెన్ షాలోమ్ బెర్నాంకే, డగ్లస్ డబ్ల్యూ. డైమండ్, ఫిలిప్ హెచ్. డైటిగ్లకు నోబెల్ అందించారు. బ్యాంకులు, ఆర్ధిక సంక్షోభాలపై సాగించిన కీలక పరిశోధనలకుగానూ ఈ అవారు ప్రకటించారు. 

=======================

నోబెల్ శాంతి బహుమతి

CLICK HERE

=======================

సాహిత్యం

CLICK HERE

=======================

రసాయన శాస్త్రం

CLICK HERE

=======================

భౌతికశాస్త్రం

CLICK HERE

======================= 

వైద్యశాస్త్రం

CLICK HERE

======================= 

Previous
Next Post »
0 Komentar

Google Tags