Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Sri Lanka's Angelo Mathews First Batter to be “Timed Out” in International Cricket – What is Timed Out?

 

Sri Lanka's Angelo Mathews First Batter to be “Timed Out” in International Cricket – What is Timed Out?

అంతర్జాతీయ క్రికెట్ లో తొలిసారి “టైమ్ అవుట్" అయిన శ్రీలంక బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్ అసలు "టైమ్ అవుట్" అంటే ఏమిటి?  

=====================

2023 వన్డే ప్రపంచకప్ టోర్నీ లో అనుకోని ఘటన చోటుచేసుకుంది. శ్రీలంక స్టార్ బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్ ఒక్క బంతిని కూడా ఎదుర్కోకుండానే 'టైమ్ ఔట్’ గా వెనుదిరగాల్సి వచ్చింది. సోమవారం బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో మాథ్యూస్ క్రీజులోకి ఆలస్యంగా రావడంతో అంపైర్ అతడిని ఔట్ గా ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ఓ ఆటగాడు ఇలా 'టైమ్ ఔట్' అవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

25వ ఓవర్లో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ వేసిన రెండో బంతికి లంక ఆటగాడు సమరవిక్రమ ఔట్ అయ్యాడు. దీంతో నంబర్ 6లో మాథ్యూస్ బ్యాటింగ్ కు దిగేందుకు బయల్దేరాడు. మైదానంలోకి అడుగుపెట్టే సమయంలో అతడి హెల్మెట్ స్ట్రాప్ విరిగిపోయింది. దీంతో అతడు కొత్త హెల్మెట్ కోసం డ్రెస్సింగ్ రూం వైపు సిగ్నల్ ఇచ్చాడు. అలా అతడు క్రీజులోకి రావడం ఆలస్యమైంది.

ఈ క్రమంలోనే బంగ్లా జట్టు 'టైమ్ ఔట్' కోసం అప్పీల్ చేసింది. ఆ అప్పీల్ ను పరిశీలించిన అంపైర్.. మాథ్యూస్ ను ఔట్ గా ప్రకటించాడు. హెల్మెట్ బాగా లేని కారణంగా ఆలస్యమైందని మాథ్యూస్ వాదించినప్పటికీ.. అంపైర్లు ఔట్ ఇచ్చేశారు. దీంతో క్రీజులోకి రాకముందే అతడు ఔటై పెవిలియన్ కు చేరాల్సి వచ్చింది.

అంతర్జాతీయ క్రికెట్లో తొలిసారి..

ఇలా ఓ క్రికెటర్ 'టైమ్ ఔట్’ తో వెనుదిరగడం ప్రపంచకప్ లోనే కాదు అంతర్జాతీయ క్రికెట్లోనే తొలిసారి కావడం గమనార్హం. అంతకుముందు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఆరుగురు ఆటగాళ్లు ఇలా టైమ్ ఔట్ అయ్యారు. అందులో భారత్ కు చెందిన హేములాల్ యాదవ్ కూడా ఉన్నాడు.

టైమ్ ఔట్ రూల్ అంటే ఏమిటి?  

ఐసీసీ నిబంధనల ప్రకారం.. క్రీజులో ఉన్న బ్యాటర్ ఔట్ అయితే.. తర్వాతి బ్యాటర్ నిర్ణీత సమయంలోగా బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. అంతర్జాతీయ క్రికెట్లో ఆ సమయం 3 నిమిషాలుగా ఉండగా.. 2023 వన్డే ప్రపంచకప్ నిబంధనల్లో ఆ గడువు 120 సెకన్లుగా మార్చారు. అంటే, 2 నిమిషాల్లో తర్వాతి బ్యాటర్ క్రీజులోకి రావాల్సి ఉంటుంది. ఒకవేళ, ఆ గడువు లోగా బ్యాటర్ రాకపోతే.. దాన్ని టైమ్ ఔట్ గా పేర్కొంటూ.. ఆ క్రికెటర్ ఔట్ గా ప్రకటిస్తారు.

=====================

WATCH THE VIDEO HERE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags