TVS Orbiter Electric
Scooter Launched – Price & Feature Details Here
టీవీఎస్ నుండి
‘ఆర్బిటర్’ పేరు తో ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల - ధర & ఫీచర్ ల వివరాలు ఇవే
===================
ప్రముఖ సంస్థ
టీవీఎస్ మోటార్ కొత్త విద్యుత్ స్కూటర్ ఆర్బిటర్ ను విడుదల చేసింది. 3.1 కిలోవాట్ అవర్ బ్యాటరీతో కూడిన ఈ స్కూటరు ధర రూ.99,900 (ఎక్స షో రూమ్, బెంగళూరు).
ఒక్కసారి ఛార్జింగ్ తో 158 కిలోమీటర్ల వరకు
ప్రయాణిస్తుంది. పట్టణ వినియోగదారులే లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ ఆర్బిటర్ లో క్రూయిజ్
కంట్రోల్,
హిల్ హోల్డ్ అసిస్ట్, విశాలమైన
బూట్ స్పేస్, ఇతర కనెక్టెడ్ ఫీచర్లు లాంటి పలు
ప్రత్యేకతలు ఉన్నాయి.
విద్యుత్
ద్విచక్ర వాహన విభాగంలో టీవీఎస్ మోటార్ కు ఇది మూడో మోడల్. ఈ విభాగంలో తన
స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడమే కాకుండా వినియోగదార్ల అభిరుచుల్లో వస్తున్న
మార్పులకు అనుగుణంగా కొత్త మోడళ్లను తీసుకొని రావడంపై దృష్టి పెట్టినట్లు టీవీఎస్
మోటార్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (విద్యుత్ వాహన విభాగం) అనిరుద్దా హల్దార్
తెలిపారు.
===================
===================


0 Komentar