Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

School Assembly 17th December Information

School Assembly 17th December Information
నేటి ప్రాముఖ్యత
1903 వ  సం. లో  రైటు సోదరులు తయారుచేసిన విమానం మొదటిసారి ఎగిరింది.
పెన్షనర్స్ డే.
చరిత్రలో ఈ రోజు
ప్రముఖ రసాయన శాస్త్రవేత్త  సర్ హంఫ్రీ డేవీ పుట్టిన రోజు
ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, కవి, రచయిత, విలియం షేక్స్పియర్ నాటకాలను తెలుగులోకి అనువదించిన  కూచి నరసింహం పుట్టిన రోజు.
సహజ నటిగా పేరుపొందిన తెలుగు సినిమా నటి జయసుధ పుట్టిన రోజు.
ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు అయిన  భోగరాజు పట్టాభి సీతారామయ్య 1959 వ సం. లో మరణించారు.
ప్రసిద్ధ తెలుగు సినిమా నటి సూర్యకాంతం మరణించిన రోజు.
నేటి అంశము-అచ్చుల విభాగములు 
హ్రస్వమలు : 6 - అ ఇ ఉ ఋ ఎ ఒ 
దీర్ఘములు : 6 - ఆ ఈ ఊ ఋ ఏ ఓ
వక్రములు : 4 - ఎ ఏ ఒ ఓ
వక్రతమములు : 2 - ఐ ఔ
హల్లుల విభాగములు
పరుషములు : 5 - క చ ట త ప
సరళములు :.5 - గ జ డ ద బ
ద్రుతము : 1- న 
స్థిరములు : 25 - ఖ ఘ ఙ ఛ ఝ ఞ ఠ ఢ ణ  థ ధ న ఫ భ మ య ర ఱ ల ళ వ శ ష స హ
కేవల స్థిరములు : 10 - ఖ ఘ ఛ ఝ ఠ ఢ థ ధ ఫ భ
అనునాసికములు : 5 - ఙ ఞ  ణ న మ
అంతస్థములు : 6 - య ర ఱ ల ళ వ
ఊష్మములు : 4 - శ ష స హ
నేటి సుభాషితం
"నిన్ను చూసి భయపడేవాడు నీ వెనక నిన్ను ద్వేషిస్తాడు."
"Thoughts of love and Good wishes gives you Peace and happiness."
మంచి పద్యం
పందిపిల్ల లీను పదియు నైదింటిని
కుంజరంబు లీను కొదమ నొకటి
యుత్తమ పురుషుండు యొక్కడు చాలడా
విశ్వదాభిరామ వినుర వేమ!
భావము:పంది ఒక్కసారి పదునైదు పిల్లలను కనును. కాని గొప్పదైన ఏనుగు ఒక పిల్లనే కనును. కాబట్టి పెక్కు సంతానమున కంటే గుణవంతుడగు ఒక్కడు మేలు అని భావము.
నేటి జీ.కె
ప్రశ్న: వేములవాడ చాళుక్యుల్లో చివరి రాజు ఎవరు?
జ: మూడో అరికేసరి
వార్తలలోని ముఖ్యాంశాలు
>సోమవారం  ఆంధ్ర ప్రదేశ్ శాసన సభలో 16 బిల్లులు ఆమోదం పొందాయి. వీటిలో ముఖ్యంగా  ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో బోధన, ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, ఎస్సీ ఎస్టీ కమిషన్ ల ఏర్పాటు & మద్యపాన నిషేధం దిశగా వేగంగా అడుగులు వంటి బిల్లులు ఉన్నాయి.
> దిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ), అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయాల (ఏఎంయూ) విద్యార్థుల పట్ల పోలీసుల తీరును నిరసిస్తూ చేపట్టిన కార్యక్రమంతో సోమవారం దేశమంతా హోరెత్తి పోయింది. ఆందోళనలు ఒక్కసారిగా అన్ని రాష్ట్రాలకు విస్తరించాయి.
దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఉన్నావ్ అత్యాచారం కేసులో ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగార్ దోషి అని ఢిల్లీ జిల్లా జడ్జి సోమవారం తీర్పు ఇచ్చారు.
> 4 నెలల్లో ఆకాశాన్ని తాకేలా అతి పెద్ద రామ మందిరం నిర్మిస్తామని భాజపా జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. 
> భారత్ లోని జనాభాను పరిగణలోనికి తీసుకొని లోక్ సభ సీట్లను ప్రస్తుతం ఉన్న 543 నుంచి 1000కిఅదే శాతంలో రాజ్యసభ సీట్లను పెంచాలని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యానించారు.
> ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో మహిళలే పాలకులు అయితే ప్రజల జీవన ప్రమాణాలు బాగా మెరుగుపడతాయని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పేర్కొన్నారు.
> ట్రాయ్‌ కొత్త నిబంధనల ప్రకారం వినియోగదారులు రెండు రోజుల్లో ఒక నెట్‌ వర్క్‌ నుంచి మరో నెట్‌వర్క్‌కు మారిపోవచ్చు.
School Assembly 17th December Information, School Assembly,prayer songs, Assembly information, historical events, information of the day, news of the day, golden words,today golden words, moral sentences, today's importance, headlines in the news, December month school assembly day wise, December 2019 school assembly,December 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 17th December 2019 assembly, 17th December 2019 assembly,news of the day history,news of the day highlights,17th dec 2019 assembly, dec 17th assembly, dec 17th historical events, 17th December 2019 assembly, december 17th assembly, december 17th historical events, school related today assembly,school related today news, school related december 17th information, school related december month information
Previous
Next Post »
0 Komentar

Google Tags