Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

School Assembly 26th January Information

School Assembly 26th January Information

నేటి ప్రాముఖ్యత
భారత గణతంత్ర దినోత్సవం
ఇంటర్నేషనల్ కస్టమ్స్ దినోత్సవం
చరిత్రలో ఈరోజు
1565: దక్షిణ భారతదేశమున చివరి హిందూ సామ్రాజ్యమైన విజయనగర పతనానికి దారితీసిన రాక్షసి తంగడి యుద్ధం జరిగింది.
1950:భారత గణతంత్ర దినోత్సవం. జనవరి 26 న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
1950: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అవతరించింది.
1950: భారత సుప్రీం కోర్టు పనిచెయ్యడం మొదలుపెట్టింది.
1957: జమ్మూ కాశ్మీరు రాష్ట్రం అవతరించింది.
1965: హిందీ భాషను భారత అధికార భాషగా గుర్తించారు.
2001: గుజరాత్ లో భయంకర భూకంపంలో 20,000 మంది దుర్మరణం చెందారు.
ప్రముఖ వ్యంగ్య చిత్రకారుడు, common man సృష్టికర్త ఆర్.కె.లక్ష్మణ్ 2015 వ సం.లో మరణించారు.
మంచి మాట:
దేన్నీ కొత్తగా ప్రయత్నించని వారే ఏ పొరపాట్లూ చెయ్యరు- రూజ్‌వెల్డ్‌

వార్తలలోని ముఖ్యాంశాలు
>తెలుగింటి ముద్దుబిడ్డ పీవీ సింధును పద్మభూషణ్‌ పురస్కారం వరించింది.  సింధు సహా తెలంగాణ నుంచి ముగ్గురిని, ఆంధ్రప్రదేశ్‌ నుంచి పౌరాణిక నటుడు యడ్ల గోపాలరావును, తోలు బొమ్మ కళాకారుడు దళవాయి చలపతిరావును ఈ పురస్కారాలు వరించాయి.
>ప్రజావ్యవహారాల రంగం నుంచి మాజీ కేంద్ర మంత్రులు, దివంగత జార్జి ఫెర్నాండెజ్, అరుణ్‌ జైట్లీ, సుష్మా స్వరాజ్‌లకు కేంద్రం పద్మవిభూషణ్‌ పురస్కారం ప్రకటించింది. మాజీ కేంద్ర మంత్రి దివంగత మనోహర్‌ పారికర్‌కు పద్మభూషణ్‌ పురస్కారం ప్రకటించింది.
>ఇటీవల దివంగతులైన పెజావర మఠాధిపతి శ్రీవిశ్వేశతీర్థ స్వామీజీకి పద్మవిభూషణ్‌ పురస్కారం ప్రకటించింది. బాక్సింగ్‌ క్రీడాకారిణి మేరీకోమ్‌ను పద్మవిభూషణ్‌ పురస్కారం వరించింది.
>సామాజిక, ఆర్థిక ఆకాంక్షలను సాధించుకునే క్రమంలో రాజ్యాంగ పద్ధతులకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి కోవింద్‌ ప్రజలకు, ముఖ్యంగా యువతకు ఉద్బోధించారు.
>ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి మండల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే 536 రకాల ప్రభుత్వ సేవలు పొందవచ్చు.
>ఆంధ్రప్రదేశ్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీ) కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌రెడ్డి, విజయవాడ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఏసీపీ) కొట్ర సుధాకర్‌లకు రాష్ట్రపతి పతకం (ప్రెసిడెంట్‌ మెడల్‌) దక్కింది.
>ఏ.పి. రాష్ట్రానికి చెందిన మాజీ ఎన్నికల ప్రధానాధికారి, సీనియర్ ఐఎఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేది రాష్ట్రపతి రామ్‌ నాథ్ కోవింద్ చేతుల మీదిగా ఉత్తమ ఎలక్షన్ సిఈవో అవార్డును అందుకున్నారు.
>సమాజంలో ఓటు హక్కు ఒక బలమైన ఆయుధమని ఏ.పి.  గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. అర్హత ఉన్నవారంతా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.
>తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ మొత్తం 120 మున్సిపాలిటీలకు గాను 109 స్థానాలను, 9 కార్పొరేషన్లకు గాను 8 చోట్ల విజయం సాధించింది.
>పౌరసత్వ సవరణ చట్టం విషయంలో కేంద్ర ప్రభుత్వానిది 100 శాతం తప్పుడు నిర్ణయమని, సీఏఏని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మాణం చేసి కేంద్రానికి పంపిస్తాం అని  తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు.
>టర్కీలోని పలు ప్రాంతాల్లో భూకంపం ధాటికి 22 మంది మృతిచెందగా.. 1,015 మంది గాయపడ్డారు. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.8గా నమోదైంది.
>చైనాను వణికిస్తున్న కరోనా వైరస్‌ కారణంగా మొత్తం 41 మంది మరణించారు. కరోనా వైరస్‌ ఇప్పటికే అనేక దేశాలకు విస్తరించగా భారత్‌లోనూ ఈ వ్యాధిపై ఆందోళన మొదలైంది.
School Assembly 26th January Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,January month school assembly day wise
Previous
Next Post »
0 Komentar

Google Tags