Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

School Assembly 30th January Information

పాఠశాల, కాలేజీల అసెంబ్లీ నిర్వాహణ కొరకు.....
School Assembly 30th January Information


నేటి ప్రాముఖ్యత 
అమర వీరుల దినం: ఈ రోజున భారత దేశమంతటా, 11 గంటలకి, సైరన్ మోగుతుంది. భారత దేశ ప్రజలు అందరూ స్వాతంత్ర్య పోరాటములో ప్రాణాలు విడిచిన అమర వీరులకు 2 నిమిషములు మౌనం పాటించి 'శ్రద్ధాంజలి' సమర్పిస్తారు.
గాంధీజీ వర్థంతి
కుష్టువ్యాధి నివారణ దినోత్సవం.
చరిత్రలో ఈరోజు
ఫ్రాన్క్లిన్ రూజ్ వేల్ట్ 1882 వ సం.లో జన్మించారు.
భారత జాతి పిత మహాత్మా గాంధీ 1948 వ సం.లో మరణించారు.
రైటు సోదరులలో ఒకడైన ఓర్విల్లే 1948 వ సం.లో మరణించారు.
ప్రముఖ తెలుగు నవలా రచయిత వడ్డెర చండీదాస్ 2005 వ సం.లో మరణించారు.
ప్రముఖ తెలుగు రచయిత్రి నాయని కృష్ణకుమారి 2016 వ సం.లో మరణించారు.
నేటి అంశము:
చైనా చందమామ 
పున్నమి చందమామ కంటే ఎనిమిది రెట్లు ప్రకాశవంతమైన కృత్రిమ జాబిల్లిని చైనాలోని 'చెంగ్ డు ఏరో స్పేస్' ఏర్పాటు చేయబోచున్నది. ఇందుకోసం ఒక ఉపగ్రహం చుట్టూ కొన్ని ఫలకాలని అమరుస్తారు. ఈ ఉపగ్రహాన్ని భూమికి సుమారు 500 కిలో మీటర్ల ఎత్తున నిలుపుతారు. చంద్రుడు ఎలాగైతే సూర్యకిరణాలని ప్రతిఫలిస్తూ వెలుతురుని అందిస్తుందో, ఈ ఉపగ్రహం మీద ఫలకాలు కూడా సూర్యుడి కిరణాలను భూమి మీదకి ప్రతిఫలిస్తాయి.
సుభాషితం:
ఉపకారికి నుపకారము
విపరీతము గాదు సేయ వివరింపంగా;
నపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ.
భావం- తనకు మేలు చేసిన వానికి తిరిగి మేలు చెయ్యడం సామన్యమయున విషయమే.కానీ తనకు అపకారం చేసినా సరే వాని తప్పులు మన్నించి తిరిగి మేలు చేయువాడే ఉత్తముడు.


వార్తలలోని ముఖ్యాంశాలు
విద్యార్థులు పరీక్షలను ధైర్యంగా ఎదుర్కోవాలని, జీవితంలో అవో భాగం తప్ప అవే జీవితం కాదని, పరీక్షలను కష్టంగా కాకుండా ఇష్టంగా చూడాలని పరీక్ష-పే-చర్చ 2.0 కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్ధులకు ఉద్బోధించారు.
సోషలిస్టు దిగ్గజం, అలుపెరగని ప్రజాపోరాట యోధుడు, మాజీ రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ (88) కొన్నేళ్లుగా అల్జీమర్స్‌ రుగ్మతతో బాధపడుతూ మంగళవారం దిల్లీలో కన్నుమూశారు. ఆయన పరిశ్రమల మంత్రిగా, పోఖ్రాన్‌ అణుపరీక్షలను, కార్గిల్‌ యుద్ధాన్ని పర్యవేక్షించిన రక్షణమంత్రిగా దేశంపై ఫెర్నాండెజ్‌ బలమైన ముద్ర వేశారు.
అయోధ్యలోని వివాదాస్పద స్థలం చుట్టూ ఉన్న 67.39 ఎకరాల వివాద రహిత భూముల్ని వాటి అసలైన యజమానులకు అప్పగించేందుకు అనుమతించాలని, మునుపటి తీర్పును దీనికి తగ్గట్టు సవరించాలని సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం దరఖాస్తు ద్వారా కోరింది.
కియాతో ఏపీ బ్రాండ్‌ మార్మోగనున్నదని, కేవలం 11 నెలల్లో రికార్డు స్థాయిలో కియా పరిశ్రమ సిద్ధమైందని, కార్ల పరిశ్రమలోని ప్రయోగాత్మక ఉత్పత్తి ఆరంభ వేడుకలలో ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ తుది (మూడో) విడత ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 3,506 పంచాయతీలకు 11,664 మంది, 27,582 వార్డులకు 73,976 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.
దేవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) కంపెనీకి చెందిన ప్రధాన ప్రమోటర్లు రూ.31,000 కోట్ల ప్రజా ధనాన్ని డొల్ల కంపెనీలకు దారి మళ్లించారని పాత్రికేయ కంపెనీ కోబ్రాపోస్ట్‌ ఆరోపించింది. అందులో ఎస్‌బీఐ అత్యధికంగా రూ.11,000 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా రూ.4,000 కోట్ల వరకు రుణాలిచ్చినట్లు పేర్కొంది.
న్యూజిలాండ్‌ గడ్డపై భారత మహిళల క్రికెట్‌ జట్టు కూడా సిరీస్‌ కైవసం చేసుకుంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో రాణించిన మిథాలీ సేన.. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో రెండో వన్డేలో భారత్‌ 8 వికెట్ల తేడాతో కివీస్‌పై ఘన విజయం సాధించింది.
ఆస్ట్రేలియాలో 2020లో నిర్వహించే పురుషుల, మహిళల ప్రపంచ కప్‌ టీ20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్‌ జట్లు ఉన్న కఠినమైన గ్రూప్‌ 2లో కోహ్లీ సేనను చేర్చారు. మరో వైపు భారత మహిళల జట్టును గ్రూప్‌ ఏలో చేర్చారు.


Download...Above information in PDF
పైన తెలిపిన సమాచారం మొత్తం వాయిస్(voice) రూపంలో వినిపించడానికి క్రింద ఇచ్చిన ప్లే బటన్ ఫై క్లిక్ (click)చేయండి.
సూచన:ఈ ఆడియో లోడ్ అవ్వడానికి ఆయా నెట్వర్క్ స్పీడ్ ఆధారంగా కొంత సమయం పట్టవచ్చు.


  • SCHOOL ASSEMBLY:30th January( నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం)
  • SCHOOL ASSEMBLY:30th January(వార్తలలోని ముఖ్యాంశాలు)

  • School Assembly 30th January Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,January month school assembly day wise,January 2019 school assembly,January 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 30th January 2019 assembly, 30th January 2019 assembly,news of the day history,news of the day highlights,30th dec 2019 assembly, dec 30th assembly, dec 30th historical events, 30th January 2019 assembly, january 30th assembly, january 30th historical events,school related today assembly,school related today news, school related january 30th information, school related january month information, School Assembly 30th Jan Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,Jan month school assembly day wise,Jan 2019 school assembly,Jan 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 30th Jan 2019 assembly, 30th Jan 2019 assembly,news of the day history,news of the day highlights,30th dec 2019 assembly, dec 30th assembly, dec 30th historical events, 30th Jan 2019 assembly, jan 30th assembly, jan 30th historical events,school related today assembly,school related today news, school related jan 30th information, school related jan month information
    Previous
    Next Post »
    0 Komentar