Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

School Assembly 31st January Information

పాఠశాల, కాలేజీల అసెంబ్లీ నిర్వాహణ కొరకు.....

Assembly 31th January Information
చరిత్రలో ఈరోజు
1943: రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ సైన్యాలు రష్యా సైన్యానికి లొంగిపోయాయి.
శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీషు నిఘంటువుని వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రులు కొన్ని మార్పులతో 1953 జనవరి 31 ప్రచురించారు. 
1963: నెమలిని జాతీయ పక్షిగా భారత్ ప్రకటించింది.
నార్వేయిన్ భూవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు, ప్రపంచవ్యాప్త మంచు యుగాల క్రమాన్ని వివరించిన జెన్స్ ఎస్మార్క్ డానిష్ 1763 వ సం.లో జన్మించారు.
ప్రముఖ ఆర్థికవేత్త రాగ్నర్ ఫ్రిష్ 1895 వ సం.లో జన్మించారు.
గోల్కొండను పరిపాలించిన కుతుబ్‌షాహీ వంశమునకు చెందిన ఆరవ చక్రవర్తి సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా 1626 వ సం.లో మరణించారు.
నేటి అంశము:
భూమ్మీద అతి పెద్ద విత్తనమేదో తెలుసా? 
కొబ్బరికాయో, తాటికాయో అనేస్తారేమో! కానీ.. వాటికి మూడింతల పెద్దదైన కాయకు చెందిన విత్తనం ఇంకోటుంది. అదే 'కోకో డి మెర్'. ఈ చెట్లు చాలా తక్కువ ప్రాంతాల్లోనే కనిపిస్తాయి. ఆఫ్రికా తీరంలోని ద్వీపాలలో మాత్రమే కనిపించే అరుదైన చెట్లు 'కోకో డి మెర్. దీని కాయలు రెండు పెద్ద కొబ్బరికాయలు కలిపినట్టుగా ఉంటాయి. అందుకే వీటికి 'డబుల్ కోకోనట్ అనే పేరుంది. 
చెట్టులోనూ భారీతనమే... 
ఈ చెట్లు 60 నుంచి 100 అడుగుల పొడవు పెరుగుతాయి. వీటి కాయలో ఉండే విత్తనమే 25 నుంచి 80 కిలోల వరకూ బరువుంటుంది. కొబ్బరిలానే మందపాటి తోలు, టెంక, నీరు, గుజ్జు ఉంటుంది. గుజ్జు కమ్మగా, తియ్యగా ఉంటుంది. ఈ గుజ్జును చర్మ సంరక్షణ క్రీమ్లలోనూ, జామ్, జెల్లీల తయారీలోనూ వాడతారు. 
మంచి మాట/సుభాషితం:
శారీరక సౌందర్యం కన్నా హృదయ సౌందర్యం గొప్పది- రమణ మహర్షి
వార్తలలోని ముఖ్యాంశాలు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌ మధ్యంతరమా లేదా పూర్తిస్థాయిలో ఉంటుందా అన్న సందిగ్ధత వీడింది. ఫిబ్రవరి 1న కేంద్రం 2019-20కి సంబంధించి తాత్కాలిక బడ్జెట్‌ను మాత్రమే పార్లమెంటులో ప్రవేశపెడుతుందని ఆర్థికశాఖ బుధవారం స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజా సంఘాలు, కలిసొచ్చే పార్టీలతో వచ్చే నెల 11న దిల్లీలో స్వయంగా నిరాహార దీక్ష చేస్తానని ఏపీ సీఎం స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే దిశగా ఫిబ్రవరి 1 నుంచి 13 మధ్య ఆందోళనలు నిర్వహించాలని నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశంలో  నిర్ణయించారు.
తెలంగాణ గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికల్లోనూ తెరాస మద్దతుదారులు పెద్ద సంఖ్యలో గెలుపొందారు. అన్ని విడతల్లోనూ కలిపి మొత్తం 61 శాతం సర్పంచి స్థానాలు తెరాస వారి వశమయ్యాయి. కాంగ్రెస్‌ మద్దతుదారులు 22 శాతం సర్పంచి స్థానాల్లో గెలిచి ద్వితీయ స్థానంలో నిలిచారు.
ఫిబ్రవరి 5న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఓట్‌ ఆన్‌ అకౌంట్ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టనున్నారు. ఇదిలావుండగా ఫిబ్రవరి 8వతేదీ వరకు ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని శాసనసభా సలహా కమిటీ (బీఏసీ) నిర్ణయించింది.
నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో బుధవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో 2500 స్టాళ్లలో 300లకు పైగా దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ.40 కోట్ల ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.  పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవటంతో ఎలాంటి ప్రాణ హాని జరగలేదు.
మామూలుగానే శీతాకాలంలో చల్లగా ఉండే అమెరికా కనీవినీ ఎరుగని శీతల గాలులతో గడ్డకట్టుకుపోతోంది. పోలార్‌ వొర్టెక్స్‌ ప్రభావం కారణంగా ఆర్కిటిక్‌ ప్రాంతం నుంచి వీస్తున్న గాలులతో అనేక రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మైనస్‌ 53 డిగ్రీల సెల్సియస్‌ వరకు పడిపోయాయి.
సమాచార దుర్వినియోగం విషయంలో ఫేస్‌బుక్ మరో వివాదం లో చిక్కుకుంది. టీనేజర్లకు రహస్యంగా నెలవారీగా 20 డాలర్లు చెల్లించి ఫేస్‌బుక్ రిసెర్చ్‌ వర్చువల్ ప్రైవేటు నెట్‌వర్క్‌ ద్వారా వారి సమాచారాన్ని పొందుతుందని తెలుస్తున్నది.
వన్డేల్లో ఒక్కసారి డబుల్‌ సెంచరీ సాధించడమే అరుదైన విషయమైతే, అలాంటిది ఆ ఘనతను రెండుసార్లు అందుకున్న వీరుడు రోహిత్‌ శర్మ. గురువారం ఈ హిట్‌ మ్యాన్‌ ఆడబోవు 200వ వన్డే తో వన్డేల్లో మరో డబుల్‌ సెంచరీ ముంగిట నిలిచాడు.

పైన తెలిపిన సమాచారం మొత్తం వాయిస్(voice) రూపంలో వినిపించడానికి క్రింద ఇచ్చిన ప్లే బటన్ ఫై క్లిక్ (click)చేయండి.
సూచన:ఈ ఆడియో లోడ్ అవ్వడానికి ఆయా నెట్వర్క్ స్పీడ్ ఆధారంగా కొంత సమయం పట్టవచ్చు.

  • SCHOOL ASSEMBLY:31st January(నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట )
  • SCHOOL ASSEMBLY:31st January(వార్తలలోని ముఖ్యాంశాలు)

  • School Assembly 31st January Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,January month school assembly day wise,January 2019 school assembly,January 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 31st January 2019 assembly, 31st January 2019 assembly,news of the day history,news of the day highlights,31st dec 2019 assembly, dec 31st assembly, dec 31st historical events, 31st January 2019 assembly, january 31st assembly, january 31st historical events,school related today assembly,school related today news, school related january 31st information, school related january month information, School Assembly 31st Jan Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,Jan month school assembly day wise,Jan 2019 school assembly,Jan 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 31st Jan 2019 assembly, 31st Jan 2019 assembly,news of the day history,news of the day highlights,31st dec 2019 assembly, dec 31st assembly, dec 31st historical events, 31st Jan 2019 assembly, jan 31st assembly, jan 31st historical events,school related today assembly,school related today news, school related jan 31st information, school related jan month information
    Previous
    Next Post »
    0 Komentar