Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

School Assembly 15th February Information


పాఠశాల, కాలేజీల అసెంబ్లీ నిర్వాహణ కొరకు.....
School Assembly 15th February Information


చరిత్రలో ఈరోజు
2001: మానవుని జన్యువు యొక్క పూర్తి నిర్మాణం నేచుర్ పత్రికలో ప్రచురించబడింది.
ఇటలీ ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో 1564 వ సం.లో జన్మించారు.
బంజారాల ఆరాధ్య దైవం అయిన సంత్ సేవాలాల్ మహరాజ్ 1739 వ సం.లో జన్మించారు.
ప్రముఖ చలనచిత్ర నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు 1938 వ సం.లో జన్మించారు.
కూచిపూడి కళాకారులు, నాట్య గురువులు రాధా రెడ్డి 1952 వ సం.లో జన్మించారు.
వెస్టీండీస్ క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు డెస్మండ్ హేన్స్ 1956 వ సం.లో జన్మించారు.
నేటి అంశము:
ముఖ్యమంత్రి-రాష్ట్ర మంత్రిమండలి
భారత రాజ్యాంగం 66వ భాగం 2వ అధ్యాయంలోని 163, 164 నిబంధనలు రాష్ట్ర మంత్రిమండలిని గురించి వివరిస్తాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిని గవర్నరు నియమిస్తాడు. అతని సలహాపై ఇతర మంత్రులను నియమిస్తాడు. రాష్ట్ర గవర్నరు ఇష్టం ఉన్నంత కాలమే మంత్రి మండలి అధికారంలో ఉంటుంది. వాస్తవానికి రాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీ ఉన్నంత కాలమే అధికారంలో ఉంటుంది. మంత్రి మండలి సమిష్టిగా రాష్ట్ర అసెంబ్లీకి బాధ్యత వహిస్తుంది. రాష్ట్ర శాసన సభలో సభ్యులు కాని సభ్యులు ఆరు నెలలలోగా సభ్యత్వాన్ని సంపాదించాలి. రాష్ట్రంలో వాస్తవ కార్య నిర్వహణాధికారి ముఖ్య మంత్రి. రాష్ట్రపాలనా బాధ్యతను రాష్ట్ర గవర్నరు పేరు మీద ముఖ్యమంత్రి నిర్వహిస్తాడు.
మంచి మాట /సుభాషితం:
నైపుణ్యం అనేది ఎప్పుడూ లక్ష్యాన్ని చేరుకోవడానికి చేసే ప్రయత్నం, ఏకాగ్రత వల్లే అలవడుతుంది- బ్రూస్‌లీ


వార్తలలోని ముఖ్యాంశాలు
పుల్వామా జిల్లాలోని శ్రీనగర్‌-జమ్మూ జాతీయ రహదారిపై  జైష్‌ ఎ మహ్మద్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన ముష్కరుని ఆత్మాహుతి దాడిలో 39 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్ల ప్రాణాలు విడిచారు.
విశాఖ నగరంలోని కాపులుప్పాడలో రూ.70 వేల కోట్లు పెట్టుబడితో అదానీ సంస్థ ఏర్పాటుచేస్తున్న డేటా సెంటర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు.డేటా రంగానికి చెందిన కంపెనీలకు కేటాయించనున్న 1350 ఎకరాలకు క్లౌడ్‌సిటీగా పేరుపెడుతున్నట్లు ముఖ్యమంత్రి  ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్న కుటుంబాలకు రూ.100కే నల్లా కనెక్షన్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్‌ విధానాన్ని యథాతథంగా కొనసాగించనున్నారు.
తెలంగాణ వార్షిక బడ్జెట్‌ను ఈనెల 22న శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. ఈనెల 22 నుంచి 25వరకు తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు.
లోక్‌సభ ఎన్నికల నిర్వహణ తేదీలను మార్చి మొదటి వారంలో ప్రకటించేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) సమాయత్తమవుతోంది. ఈసారి ఎన్నికలు 9 దశల్లో జరిగే అవకాశం ఉంది.
తమిళనాడుకు చెందిన స్నేహ అనే న్యాయవాది నో కాస్ట్‌, నో రిలిజియన్‌ సర్టిఫికెట్‌ సంపాదించి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. భవిష్యత్‌ తరాలకు కుల, మత రహిత సమాజాన్ని అందించే మహత్కార్యంలో తనకున్న బాధ్యతను ఈ విధంగా నెరవేర్చుకున్నానన్న ఆమె వ్యక్తిత్వం అందరికీ ఆదర్శనీయం.
కేంద్రపాలిత ప్రాంతం, దేశ రాజధాని అయిన ఢిల్లీలో అధికారాల నియంత్రణపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమేనని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది.
జాతీయ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో రియా ముఖర్జీని ఓడించి పి.వి.సింధు సెమీఫైనల్‌కు చేరుకుంది. పురుషుల సింగిల్స్‌లో టాప్‌ సీడ్‌ సమీర్‌వర్మ కాలి మడమ గాయంతో ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌ నుంచి అర్ధంతరంగా తప్పుకున్నాడు. ఒకే మ్యాచ్‌ ఆడిన సైనాక్వార్టర్స్‌లో ప్రవేశించింది. క్వార్టర్స్‌లో ఆమె నేహా పండిట్‌తో తలపడనుంది.

పైన తెలిపిన సమాచారం మొత్తం వాయిస్(voice) రూపంలో వినిపించడానికి క్రింద ఇచ్చిన ప్లే బటన్ ఫై క్లిక్ (click)చేయండి.
సూచన:ఈ ఆడియో లోడ్ అవ్వడానికి ఆయా నెట్వర్క్ స్పీడ్ ఆధారంగా కొంత సమయం పట్టవచ్చు.


  • SCHOOL ASSEMBLY:15th February(నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం)
  • SCHOOL ASSEMBLY:15th February(వార్తలలోని ముఖ్యాంశాలు)

  • School Assembly 15th February Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,February month school assembly day wise,February 2019 school assembly,February 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 15th February 2019 assembly, 15th February 2019 assembly,news of the day history,news of the day highlights,15th dec 2019 assembly, dec 15th assembly, dec 15th historical events, 15th February 2019 assembly, February 15th assembly, February 15th historical events,school related today assembly,school related today news, school related February 15th information, school related February month information, School Assembly 15th Feb Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,Feb month school assembly day wise,Feb 2019 school assembly,Feb 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 15th Feb 2019 assembly, 15th Feb 2019 assembly,news of the day history,news of the day highlights,15th dec 2019 assembly, dec 15th assembly, dec 15th historical events, 15th Feb 2019 assembly, Feb 15th assembly, Feb 15th historical events,school related today assembly,school related today news, school related Feb 15th information, school related Feb month information

    Previous
    Next Post »
    0 Komentar