Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

School Assembly 16th February Information

పాఠశాల, కాలేజీల అసెంబ్లీ నిర్వాహణ కొరకు.....
School Assembly 16th February Information

చరిత్రలో ఈరోజు
1915: గాంధీజీ మొదటిసారిగా శాంతినికేతన్ని సందర్శించాడు.
2005 : ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంతో మొదలైన క్యోటో ఒప్పందం అమలయింది.
ప్రముఖ ఇంజనీర్, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత నోరి గోపాలకృష్ణమూర్తి 1910 వ సం.లో జన్మించారు.
భారతీయ చలనచిత్ర పితామహులు దాదాసాహెబ్ ఫాల్కే 1944 వ సం.లో మరణించారు.
భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త మేఘనాధ్ సాహా 1956 వ సం.లో మరణించారు.
ఆర్థిక శాస్త్రవేత్త మరియు విశ్వవిద్యాలయ సంచాలకులు వాసిరెడ్డి శ్రీకృష్ణ 1961 వ సం.లో మరణించారు.
ప్రఖ్యాత పాత్రికేయుడు, కవి, సంపాదకుడు  నార్ల వేంకటేశ్వరరావు 1985 వ సం.లో మరణించారు.
నేటి అంశము:
సెకప్ తక్రాఆట గురించి తెలుసుకుందాం !
సెకప్ తక్రా.. అంటే ఊడల బంతిని తన్నడం అచ్చం వాలీబాల్ తరహాలో ఉంటుంది ఈ ఆట. ఒక్కో జట్టులో ముగ్గురు ఆటగాళ్లుంటే రేగు అంటారు. ఇద్దరే ఉంటే డబుల్స్ రేగు అంటారు. నిబంధనల ప్రకారం బంతిని అవతలి కోర్టుకు పంపించడమే ఈ ఆట లక్ష్యం. ఆ క్రమంలో పొరపాట్లు చేస్తే అవతలి వారికి పాయింట్లు లభిస్తాయి. మొత్తం మూడు సెట్లు ఆడతారు. ప్రతి సెట్ కు 21 పాయింట్లు ఉంటాయి. ఇలా రెండు సెట్లలో ఏ జట్టు ముందుగా 21 పాయింట్లు చేస్తే వారే విజేత. రెండు జట్లు 21 పాయింట్లతో సమంగా నిలిస్తే టైబ్రేక్ ఆడతారు.
మంచి మాట /సుభాషితం:
సత్తువగల యాతడు పై
నెత్తిన దుర్భలుండు తస్కరించు నతండున్
విత్తము గోల్పడు నతడును
జిత్తని పీడితుండు జింతజెందు కుమారా!
భావం - ఓ కుమారా! శక్తియున్న బలహీనునిపై దండెత్తిన ఆ బలహీనుడు దొంగలుపడి దోచుకున్న గృహము కలవాడైనట్లు ధనహీనుడగును. శక్తి లెక పీడింపబడతాడు. మనస్సు విచారముతో,నిత్యము బాధలతో నుండును.
వార్తలలోని ముఖ్యాంశాలు
పుల్వామా ఉగ్రవాద దాడికి పాల్పడిన వారెవరైనా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. భారతీయుల రక్తం మరుగుతోందన్నారు. ఉగ్రవాదుల పని పట్టేందుకు భద్రతా బలగాలకు స్వేచ్ఛను ఇచ్చామన్నారు.
పుల్వామాలో ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌కు 'అత్యంత ప్రాధాన్య దేశం' హోదాను ఉపసంహరించాలని భారత్‌ నిర్ణయించింది. దీనికింద పాక్‌ నుంచి దిగుమతి చేసుకునే సరకులపై కస్టమ్స్‌ సుంకాలను గణనీయంగా పెంచడం, రేవుల వద్ద ఆంక్షలు, కొన్ని సరకులపై నిషేధం వంటి చర్యలు చేపట్టనుంది.
ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఇకపై  వ్యవసాయానికి 9గంటల ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏడు గంటల ఉచిత్‌ విద్యుత్‌ సరఫరాను 9గంటలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ మెరిట్‌ జాబితాలను రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. అర్హులైన వారికి మే 15న నియామక పత్రాలు జారీ చేస్తామని  వెల్లడించారు. 
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గాన్ని ఈనెల 19న విస్తరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఎనిమిది నుంచి పదిమందికి అవకాశం దక్కనున్నట్లు తెలిసింది.
తెలంగాణలోని చెరువులకు పూర్వ వైభవం వస్తేనే మిషన్‌ కాకతీయ కార్యక్రమానికి సార్థకత చేకూరుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. నాడు కాకతీయులు నిర్మించిన చెరువులే శతాబ్దాల తరబడి తెలంగాణ వ్యవసాయానికి ముఖ్య నీటివనరుగా ఉన్నాయని గుర్తు చేశారు.
ఎన్నుకొన్న ప్రజాప్రతినిధులు పదవీ కాలంలో ఏం చేశారో రిపోర్టు కార్డు అడగాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రజలకు సూచించారు. దాన్ని చూసిన తరువాతే ఎన్నికల్లో ఓటు వేయాలని హితవు పలికారు.
జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో శనివారం మహిళల సింగిల్స్‌ ఫైనల్లో భారత టాప్‌ షట్లర్లు పి.వి.సింధు, సైనా నెహ్వాల్‌ తలపడనున్నారు. గతేడాది కూడా వీళ్లిద్దరే ఫైనల్లో తలపడగా సైనా విజేతగా నిలిచింది.

పైన తెలిపిన సమాచారం మొత్తం వాయిస్(voice) రూపంలో వినిపించడానికి క్రింద ఇచ్చిన ప్లే బటన్ ఫై క్లిక్ (click)చేయండి.
సూచన:ఈ ఆడియో లోడ్ అవ్వడానికి ఆయా నెట్వర్క్ స్పీడ్ ఆధారంగా కొంత సమయం పట్టవచ్చు.  • SCHOOL ASSEMBLY:16th February(చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం)
  • SCHOOL ASSEMBLY:16th February(వార్తలలోని ముఖ్యాంశాలు)

  • School Assembly 16th February Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,February month school assembly day wise,February 2019 school assembly,February 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 16th February 2019 assembly, 16th February 2019 assembly,news of the day history,news of the day highlights,16th dec 2019 assembly, dec 16th assembly, dec 16th historical events, 16th February 2019 assembly, February 16th assembly, February 16th historical events,school related today assembly,school related today news, school related February 16th information, school related February month information, School Assembly 16th Feb Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,Feb month school assembly day wise,Feb 2019 school assembly,Feb 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 16th Feb 2019 assembly, 16th Feb 2019 assembly,news of the day history,news of the day highlights,16th dec 2019 assembly, dec 16th assembly, dec 16th historical events, 16th Feb 2019 assembly, Feb 16th assembly, Feb 16th historical events,school related today assembly,school related today news, school related Feb 16th information, school related Feb month information

    Previous
    Next Post »
    0 Komentar