Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

School Assembly 19th February Information

పాఠశాల, కాలేజీల అసెంబ్లీ నిర్వాహణ కొరకు.....
School Assembly 19th February Information


చరిత్రలో ఈరోజు
1831: అమెరికాలోని, పెన్సిల్వేనియాలో, మొదటిసారిగా బొగ్గుతో నడిచే యంత్రాన్ని ప్రయోగాత్మకంగా నడిపారు.
1969: బోయింగ్ 747 జంబో జెట్ ని మొట్ట మొదటిసారి ప్రయోగాత్మకంగా నడిపి చూసారు.
1970: స్పుత్నిక్ 52, మొల్నియ 1-13 కమ్యూనికేషన్ ఉపగ్రహాలను సోవియట్ రష్యా ప్రయోగించింది.
1982: బోయింగ్ 757 అనే విమానం మొట్ట మొదటిసారిగా ఆకాశంలో ఎగిరింది.
1985: కృత్రిమ గుండె పెట్టుకున్న విలియం జె. స్క్రోడర్  ఆసుపత్రిని వదిలి బయటి ప్రపంచానికి వచ్చిన మొదటి మనిషి.
2002: నాసా కుజగ్రహానికి పంపిన 'మార్స్ ఒడిస్సీ రోదసీ నౌక' "థెర్మల్ ఎమిషన్ ఇమేజింగ్ సిస్టం"ని ఉపయోగించి కుజగ్రహం యొక్క భూతలపు పటాల్ని తయారుచేయటం మొదటిసారిగా మొదలు పెట్టింది.
సూర్యకేంద్రక సిద్దాంతాన్ని ప్రతిపాదించిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త నికోలస్ కోపర్నికస్ 1473 వ సం.లో జన్మించారు.
ఛత్రపతి శివాజీ మహారాష్ట్ర 1630 వ సం.లో జన్మించారు.
భారత స్వాతంత్ర్య సమర యోధుడు, భారత జాతీయ నాయకుడు గోపాలకృష్ణ గోఖలే 1915 సం. లో మరణించాడు.
నేటి అంశము:
కంప్యూటర్ కు చెందిన కొన్ని అబ్రివేషన్లు
PDF: Portable Document Format
DVD- Digital Optical Disc
OS-Operating System
COMPUTER-Common Operating Machine Particularly Used for Technical  Education and Research.
WWW-World Wide Web
మంచి మాట /సుభాషితం:
వృద్ధజన సేవ చేసిన
బుద్ధి విశేషజ్ఞుఁడనుచు బూత చరితుడున్
సద్ధర్మశాలియని బుధు
లిద్ధరఁబొగిడెదరు ప్రేమయెసగఁ కుమారా!
భావం - పెద్దలను గౌరవించేవాడిని, మంచి బుద్ది కలవాడని,మంచి తెలివి తేటలు కలవాడనీ, ధర్మం తెలిసిన వాడినీ జనులు ఈ లోకంలో పొగుడుతారు.


వార్తలలోని ముఖ్యాంశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్నదాతా సుఖీభవపథకం కింద రైతులకు పెట్టుబడి సాయం క్రింద ఒక్కొక్కరి ఖాతాకు రూ.వెయ్యి చెల్లింపు మొదలైంది. మార్చిలో మరో రూ.3వేలు బదిలీ చేయబోనున్నది.
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ శాసనమండళ్లలో అయిదు స్థానాల వంతున ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) షెడ్యూల్‌ విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా నేటి ఉదయం రాజ్‌భవన్‌లో పదిమంది మంత్రులతో గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. వీరిలో ఈటల రాజేందర్‌, జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్‌, కొప్పుల ఈశ్వర్‌ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, చామకూర మల్లారెడ్డిలు ఉన్నారు.
తెలంగాణలోని ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో వృద్ధుల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రత్యేకంగా క్లినిక్‌లను నిర్వహించనున్నారు. అందులో అవసరమైన నిర్ధరణ పరీక్షలు చేస్తారు. ఔషధాలను కూడా అందజేస్తారు.
పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ వాహనశ్రేణిపై దాడి సూత్రధారులు జైష్‌ ఎ మహ్మద్‌ కమాండర్లు అయిన అబ్దుల్‌ రషీద్‌ అలియాస్‌ ఘాజీ, కమ్రాన్‌తో పాటు మరో ఉగ్రవాదిని భారత సైన్యం మట్టుబెట్టింది.
పోలీసులు(100), అగ్నిమాపక శాఖ(101), ఆరోగ్యం(108), మహిళల హెల్ప్‌లైన్‌(1090) తదితర నంబర్లకు బదులు ఇకపై కేవలం 112 నంబర్‌కు ఫోన్‌ చేస్తే సరిపోతుంది. ఈ సమీకృత మద్దతు వ్యవస్థ నేటి నుంచి అందుబాటులోకి రానుంది.
ఎన్నికల ముందు ప్రజాకర్షక పథకాలకు వెచ్చించాల్సిన నిధుల కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఆర్‌బీఐ రూ.28,000 కోట్ల డివిడెండును ప్రకటించింది.
గత ఏడాది చివర్లో బలపడి కుదుటపడినట్టే కనిపించిన భారత మారకం (రూపాయి).. కొత్త ఏడాదిలో తిరిగి క్షీణిస్తూ ఆర్థిక వ్యవస్థను కలవరపెడుతోంది. ఒక పక్క చమురు ధరలు పెరగడం, మరో పక్క కశ్మీర్‌ ఉద్రిక్తతలు, రాబోయే సాధారణ ఎన్నికలు వంటి పరిణామాలు రూపాయి క్షీణతకు ఆజ్యం పోస్తున్నాయి.


పైన తెలిపిన సమాచారం మొత్తం వాయిస్(voice) రూపంలో వినిపించడానికి క్రింద ఇచ్చిన ప్లే బటన్ ఫై క్లిక్ (click)చేయండి.
సూచన:ఈ ఆడియో లోడ్ అవ్వడానికి ఆయా నెట్వర్క్ స్పీడ్ ఆధారంగా కొంత సమయం పట్టవచ్చు.


  • SCHOOL ASSEMBLY:19th February(చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం)
  • SCHOOL ASSEMBLY:19th February(వార్తలలోని ముఖ్యాంశాలు)

  • School Assembly 19th February Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,February month school assembly day wise,February 2019 school assembly,February 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 19th February 2019 assembly, 19th February 2019 assembly,news of the day history,news of the day highlights,19th dec 2019 assembly, dec 19th assembly, dec 19th historical events, 19th February 2019 assembly, February 19th assembly, February 19th historical events,school related today assembly,school related today news, school related February 19th information, school related February month information, School Assembly 19th Feb Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,Feb month school assembly day wise,Feb 2019 school assembly,Feb 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 19th Feb 2019 assembly, 19th Feb 2019 assembly,news of the day history,news of the day highlights,19th dec 2019 assembly, dec 19th assembly, dec 19th historical events, 19th Feb 2019 assembly, Feb 19th assembly, Feb 19th historical events,school related today assembly,school related today news, school related Feb 19th information, school related Feb month information
    Previous
    Next Post »
    0 Komentar