Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

School Assembly 4th February Information

పాఠశాల, కాలేజీల అసెంబ్లీ నిర్వాహణ కొరకు.....
School Assembly 4th February Information

నేటి ప్రాముఖ్యత 
వరల్డ్ క్యాన్సర్ డే 
శ్రీలంక స్వాతంత్య్ర దినోత్సవం
చరిత్రలో ఈరోజు
2007: భారతీయ సంతతితికి చెందిన అమెరికన్ మహిళా వ్యోమగామి సునీతా విలియమ్స్ 22 గంటల 27 నిమిషాలు రోదసిలో నడచి కొత్త రికార్డు సృష్టించింది.
సాహిత్యపిపాసకుడు, ఎన్నో పద్యాలను అల్లినవాడు, హనుమంతరావు అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం మొదలైన సమస్త వైద్యశాఖలలో సిద్ధహస్తుడు బెళ్లూరి శ్రీనివాసమూర్తి 1910 వ సం.లో జన్మించారు.
కథక్ కళాకారుడు బిర్జూ మహరాజ్ 1938 వ సం.లో జన్మించారు.
భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు రాకేష్ శుక్లా 1948 వ సం.లో జన్మించారు.
మునిమాణిక్యం నరసింహారావు 1973 వ సం.లో మరణించారు. తెలుగు హాస్యరచయితలలో మునిమాణిక్యం గారికి ఒక విశిష్టస్థానం ఉంది.
ప్రముఖ భారత విద్యావేత్త డి.ఎస్.కొఠారి 1993 వ సం.లో మరణించారు.
నేటి అంశము:
కాలములు ప్రధానముగా మూడు విధములు. 
అవి : 1) వర్తమాన కాలము, 2) భూతకాలము 3) భవిష్యత్ కా లము. 
కొందరు నాలుగవదిగా తద్దర్మకాలమును కూడా పేర్కొందురు. 
జరుగుచున్న పనిని తెలియుజేయునది 'వర్తమాన కాలము', జరిగిన పనిని తెలియుజేయునది 'భూతకాలము', జరుగబోవు పనిని తెలియుజేయునది భవిష్యత్కాలము' మరియు సహజసిద్దముగా జరుగు పనులను తెలియజేయునది 'తద్దర్మకాలము'.
తద్దర్మకాలమునకు ఉదా: సూర్యుడు ఉదయించును, పక్షులు ఎగురును. 
మంచి మాట /సుభాషితం:
చిక్కియున్న వేళ సింహంబునైనను
బక్కకుక్క కరచి బాధచేయు
బలిమి లేనివేళ బంతంబు చెల్లదు
విశ్వదాభిరామ వినురవేమ
భావం - అడవికి మృగరాజు అయిన సిమ్హం చిక్కిపోయి ఉంటే వీధిన పోయే బక్క కుక్క కూడా భాద పెడుతుంది.అందుకే తగిన బలము లేని చోట పౌరుషము ప్రదర్శించరాదు.
వార్తలలోని ముఖ్యాంశాలు
కేంద్రానికి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మధ్య పోరు తీవ్రస్థాయికి చేరింది. శారదా కుంభకోణం కేసులో కోల్‌కతా పోలీసు కమిషనర్‌ను ప్రశ్నించే నిమిత్తం సీబీఐ అధికారులు ఆయన నివాసానికి వెళ్లే ప్రయత్నం చేయగా, రాష్ట్ర పోలీసు బలగాలు సీబీఐ అధికారుల్ని జీపులో పడేసి పోలీసు స్టేషన్‌కు తీసుకుపోయాయి.  
కాంగ్రెస్‌ ప్రకటించిన రుణమాఫీ కేవలం ఎన్నికల తాయిలం మాత్రమేనని, అది రైతుల కష్టాలను తీర్చదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రుణాల రద్దు తాత్కాలిక చర్య అని, శాశ్వత పరిష్కారం కాబోదని స్పష్టం చేశారు.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక రైతుల రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.
Express టీవీ , కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరాం హత్య మిస్టరీ వీడినట్లేనని తెలుస్తున్నది. ఈకేసులో ప్రధాన నిందితుడు రాకేష్‌రెడ్డిగా, శిఖా చౌదరిని సూత్రధారిగా పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి ఏపి రాజధాని అమరావతిలోని హైకోర్టు శాశ్వత భవనానికి శంకుస్థాపన చేశారు, అనంతరం హైకోర్టు తాత్కాలిక భవనం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన ప్రసంగింస్తూ మారుతున్న కాలానికి అనుగుణంగా  ప్రజలకు మరింత చేరువ కావాల్సిన అవసరం న్యాయవ్యవస్థపై ఉందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం వ్యవసాయంతోపాటు ఇతర రంగాల్లో దేశానికి దిక్సూచిగా నిలుస్తోందని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా పథకాలకు దేశవ్యాప్తంగానే కాకుండా ఐక్యరాజ్య సమితి నుంచీ ప్రశంసలు వచ్చాయన్నారు.
ఆదాయపు పన్ను (ఐటీ) రిటర్నుల మదింపు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే జరగబోతోంది. రెండేళ్లలో ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు  ఛైర్మన్‌ సుశీల్‌ చంద్ర అభిప్రాయపడ్డారు.
న్యూజిలాండ్‌తో నాలుగో వన్డేలో పరాజయం చవిచూసిన భారత్‌.. ఆదివారం జరిగిన ఐదో వన్డేలో 35 పరుగుల తేడాతో కివీస్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 49.5 ఓవర్లలో 252 పరుగులు చేసింది. న్యూజిలాండ్‌ 44.1 ఓవర్లలో 217 పరుగులకే ఆలౌటైంది. రాయుడికి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌, షమికి మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ లభించాయి.

పైన తెలిపిన సమాచారం మొత్తం వాయిస్(voice) రూపంలో వినిపించడానికి క్రింద ఇచ్చిన ప్లే బటన్ ఫై క్లిక్ (click)చేయండి.
సూచన:ఈ ఆడియో లోడ్ అవ్వడానికి ఆయా నెట్వర్క్ స్పీడ్ ఆధారంగా కొంత సమయం పట్టవచ్చు.

  • SCHOOL ASSEMBLY:4th February(నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం)
  • SCHOOL ASSEMBLY:4th February(వార్తలలోని ముఖ్యాంశాలు)

  • School Assembly 4th February Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,February month school assembly day wise,February 2019 school assembly,February 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 4th February 2019 assembly, 4th February 2019 assembly,news of the day history,news of the day highlights,4th dec 2019 assembly, dec 4th assembly, dec 4th historical events, 4th February 2019 assembly, February 4th assembly, February 4th historical events,school related today assembly,school related today news, school related February 4th information, school related February month information, School Assembly 4th Feb Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,Feb month school assembly day wise,Feb 2019 school assembly,Feb 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 4th Feb 2019 assembly, 4th Feb 2019 assembly,news of the day history,news of the day highlights,4th dec 2019 assembly, dec 4th assembly, dec 4th historical events, 4th Feb 2019 assembly, Feb 4th assembly, Feb 4th historical events,school related today assembly,school related today news, school related Feb 4th information, school related Feb month information

    Previous
    Next Post »
    0 Komentar