Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

School Assembly 3rd January information

School Assembly 3rd January information

నేటి ప్రాముఖ్యత
*మహిళా టీచర్స్ డే.
చరిత్రలో ఈరోజు
*1985వ సం.లో రవిశాస్త్రి ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు సాధించి ఈ ఘనత పొందిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు.
*1999 వసం.లో ఐరోపా లోని 11 దేశాల్లో కార్పొరేట్లు, పెట్టుబడుల మార్కెట్లలో యూరోను ప్రవేశపెట్టారు.
*భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని మరియు రచయిత్రి సావిత్రిబాయి ఫూలే 1831 వ సం.లో జన్మించారు.
*ప్రసిద్ధ మెటలర్జిస్టు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత బ్రహ్మ ప్రకాష్ 1984 వ సం.లో మరణించారు.
*స్వాతంత్ర్య సమర యోధులు, రచయిత క్రొవ్విడి లింగరాజు 1986 వ సం.లో మరణించారు.
*భారతీయ ఏరోస్పేస్ ఇంజనీరు, ఇస్రో మాజీ ఛైర్మన్ సతీష్ ధావన్ 2002 వ సం.లో మరణించారు.
నేటి అంశము:
అసలు చెట్లు ఎలా శ్వాసిస్తాయి ...?
పగటి పూట పచ్చని చెట్లు గాలిలోగల బొగు పులుసు వాయువును గ్రహించి ప్రాణవాయువును బయటికి వదిలివేస్తాయి. జంతువులు మాత్రం దీనికి విరుద్ధంగా ప్రాణవాయువును గ్రహించి బొగ్గుపులుసు వాయువును విడుస్తాయి. అయితే చెట్లలో రాత్రి పూట బొగ్గుపులుసు వాయువును పీల్చే ప్రక్రియ ఆగిపోతుంది. అప్పుడు మాత్రం అవి ప్రాణవాయువును విడుదల చేస్తాయని సరిగ్గా జంతువులలాగే శ్వాసిస్తాయని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు.
నిజానికి అసలు పగటిపూట అవి బొగ్గుపులసు వాయువును గ్రహించడం వాటి శ్వాసప్రక్రియ కాదు. ఇది ఆహారం సంపాదించు కొనే ప్రక్రియ. పగలు కూడా నిజానికి జంతువులలాగ అవి శ్వాసి స్తూనే వుంటాయి. కాని ఆ శ్వాస ప్రక్రియలో అది వదిలే బొగ్గు పులుసుగాలి అధిక ప్రమాణంలో వెలువడే ప్రాణవాయువులో మరుగున పడిపోతూ వున్నది.
మంచి మాట:
వ్యక్తి ఉన్నతమైన స్థితిలో ఉన్నాడంటే, అతడు ఎన్నో కఠిన పరీక్షల్ని ఎదుర్కొని నిలిచాడని అర్థం- ఆస్కార్‌ వైల్డ్‌
మంచి పద్యం
ఆత్మశుద్ధి లేని యాచారమది యేల
భాండశుద్ధి లేని పాకమేల?
చిత్తశుద్ధిలేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: మనసు నిర్మలముగా లేనట్లయితే ఆచారములు పాటించడంవల్ల ప్రయోజనం లేదు. పాత్రలు శుభ్రముగాలేని వంట, మనసు స్థిరముగా లేని శివ పూజ వ్యర్థములే అవుతాయి. ఏమీ ప్రయోజనముండదు.
నేటి జీ.కె
ప్రశ్న: దంత వైద్యుడు (Dentist) ఉపయోగించే అద్దం ఏది ?
A. పుటాకార దర్పణం (Concave mirror)

వార్తలలోని ముఖ్యాంశాలు
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1.42 కోట్ల కుటుంబాలకు వర్తింపచేసే వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల పంపిణీ కార్యక్రమానికి శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. క్యాన్సర్‌ సహా 2,059 వ్యాధులకు వైద్యం బిల్లు రూ.1,000 దాటితే పథకం వర్తించనున్నది.
* ఆశించిన రీతిలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పనితీరు కనిపించడం లేదంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.
* బందరు ఫిషింగ్‌ హార్బర్‌ అభివృద్ధికి ప్రభుత్వం నడుం బిగించింది. హార్బర్‌లో రూ. 280 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక సదుపాయాలు, మౌలిక వసతులు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
* తెలంగాణ ఆర్టీసీ టిక్కెట్‌ తీసుకోవలసిన బాధ్యత ఇక పూర్తిగా ప్రయాణికుడిదే. మోటారు వాహన చట్టంలోని సెక్షన్‌ 178 ప్రకారం టిక్కెట్‌ లేకుండా ప్రయాణం చేస్తే  రూ.500 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని  అధికారులు తెలిపారు.
* తెలంగాణా  ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)కు సంబంధించిన లోగోను, వెబ్‌సైట్‌ను గురువారం ప్రారంభించారు. ఏఐ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రజలకు సేవలను మరింత సులభతరం  చేస్తున్నట్టు వెల్లడించారు.
* ‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ (మా) డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో తీవ్రస్థాయిలో వివాదానికి ప్రధాన బిందువుగా నిలిచిన రాజశేఖర్‌పై సినీ ఇండస్ట్రీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో కలత చెందిన ఆయన మా’  ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
* కేబుల్‌ టీవీ చార్జీల భారాన్ని తగ్గించేలా ట్రాయ్‌ తాజాగా కొత్త టారిఫ్‌ ఆర్డరు ప్రకటించింది. దీంతో రూ. 130 నెట్‌వర్క్‌ కెపాసిటీ ఫీజు (ఎన్‌సీఎఫ్‌)తో ప్రస్తుతం 100 ఉచిత చానళ్లు లభిస్తుండగా.. ఈ సంఖ్య 200కు పెరగనుంది. పే చానళ్ల గరిష్ట ధర రూ. 19 నుంచి రూ. 12కి తగ్గుతుంది.
* రక్షణ దళాల్లో ఒకటైన నావికాదళంపై వలపు వల(హానీ ట్రాప్‌) విసిరి కీలకమైన రహస్యాలను చోరీ చేస్తున్న ఉదంతంపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) సంస్థ అధికారులు విచారణ జరుపుతారని సమాచారం.
School Assembly 3rd January Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,January month school assembly day wise,January 2019 school assembly,January 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 3rd January 2019 assembly, 3rd January 2019 assembly,news of the day history,news of the day highlights,3rd dec 2019 assembly, dec 3rd assembly, dec 3rd historical events, 3rd January 2019 assembly, january 3rd assembly, january 3rd historical events,school related today assembly,school related today news, school related january 3rd information, school related january month information, School Assembly 3rd Jan Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,Jan month school assembly day wise,Jan 2019 school assembly,Jan 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 3rd Jan 2019 assembly, 3rd Jan 2019 assembly,news of the day history,news of the day highlights,3rd dec 2019 assembly, dec 3rd assembly, dec 3rd historical events, 3rd Jan 2019 assembly, jan 3rd assembly, jan 3rd historical events,school related today assembly,school related today news, school related jan 3rd information, school related jan month information?Ganitotsavam(maths day)-2019 questions for District Level Quiz
Previous
Next Post »
0 Komentar

Google Tags