Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Budget 2019 Highlights

Budget 2019 Highlights


కేంద్ర బడ్జెట్
ఈ ఉదయం 11 గంటలకు లోక్ సభలో 2019-20 మధ్యంతర బడ్జెట్ ప్రతిపాదనలను పీయుష్ గోయల్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ లోని మరిన్ని ముఖ్యాంశాలు...
 • ఆదాయపు పన్ను పరిమితి రూ. 2.5లక్షల నుంచి రూ. 5లక్షలకు పెంపు
 • వ్యవసాయ ఆదాయ మద్దతు పథకంలో భాగంగా ప్రతి సంవత్సరం రూ.6,000 నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పారు. రూ.2,000 చొప్పున మూడు విడతల్లో ఈ సొమ్మును జమ చేయనున్నట్లు ప్రకటించారు
 • గ్రాట్యుటీ పరిమితి 30లక్షలకు పెంపు గ్యాట్యుటీ పరిమితిని రూ.10లక్షల నుంచి రూ.30లక్షలకు పెంచుతున్నాం. 
 • కార్మిక ప్రమాద బీమా మొత్తం రూ.1.50లక్షల నుంచి రూ.6లక్షలకు పెంపు*
 • 2022నాటికి ప్రతి ఒక్కరికీ ఇళ్లు
 • దేశవ్యాప్తంగా అత్యంత వెనుకబడిన 150 జిల్లాలపై ప్రత్యేక దృష్టి
 • అంగన్‌వాడీ టీచర్ల జీతం 50 శాతం పెంపు
 • అసంఘటిత కార్మికుల కోసం ఫించన్‌ పథకం. నెలకు రూ.100 చెల్లిస్తే నెలకు మూడు వేల పెన్షన్‌
 • ఎన్‌పీఎస్‌ విధానంలో ప్రభుత్వ వాటా 14 శాతానికి పెంపు
 • బోనస్‌ పరిమితి 21వేల పెంపు
 • ఇంటి అద్దె ద్వారా వచ్చే ఆదాయంపై రూ. 2.4 లక్షల వరకు టీడీఎస్‌ ఉండదు.
 • స్టాండర్డ్ Deductions 40 వేలు నుండి 50000 కు పెంపు
 • ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్‌ను 24 గంటల్లో తీసుకోవచ్చునని వెల్లడి.
 • అలాగే హోంలోన్ల పైన వడ్డీ మినహాయింపును రూ.2.5 లక్షలకు పెంపు.
 •  గోకుల్ మిషన్ కు ఈ సంవత్సరం రూ. 750 కోట్ల కేటాయింపులు.
 •  గో ఉత్పాదకతను పెంచడం కోసం సరికొత్త 'రాష్ట్రీయ కామ్ ధేన్ ఆయోగ్'
 • ఈఎస్ఐ లిమిట్ రూ. 15 వేల నుంచి రూ. 21 వేలకు పెంపు.
 • ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ పేరిట మరో సరికొత్త స్కీమ్.
 • రూ. 15 వేల నెల జీతం ఉండే వేతన జీవులకు కొత్త పథకం.
 • కొత్త పెన్షన్ విధానంలో నెలకు రూ. 3 వేలు అందిస్తాం.
 • కొత్త పెన్షన్ విధానానికి రూ. 500 కోట్ల  కేటాయింపు.
 • 10 కోట్ల మంది కార్మికులకు పెన్షన్ స్కీమ్ తో లాభం.
 • బ్యాంకుల రుణాలు రూ. 35,984 కోట్లకు పెరుగుదల.
 • కిసాన్ క్రెడిట్ కార్డులపై 2 శాతం వడ్డీ రాయితీ.
 • ఉజ్వల యోజన కింద 8 కోట్ల ఉచిత వంటగ్యాస్ కనెక్షన్లు.
 • ముద్ర యోజనలో రూ. 7.23 లక్షల కోట్ల రుణాలు.
 • రక్షణ రంగానికి రూ. 3 లక్షల కోట్ల కేటాయింపు.
 •  అవసరమనిపిస్తే అదనపు నిధుల కేటాయింపుకు సిద్ధం.
 • 60 ఏళ్లు దాటిన కార్మికులంతా పెన్షన్ స్కీమ్ లో భాగస్తులే.
 • ప్రధాన మంత్రి శ్రమ్‌ యోజన కింద నెలకు రూ.3,000 పింఛను చెల్లిస్తారు. దీనికోసం సంఘటిత రంగ కార్మికులు నెలకు రూ.100 చెల్లించాలి. ఈ పథకం కింద ఐదేళ్లలో 10కోట్ల మంది లబ్ధి పొందే అవకాశం ఉంది.
 • రక్షణ బలగాలకు రూ.3,00,000 కోట్లకు పైగా కేటాయింపులు. అవసరమైతే అదనపు నిధుల కేటాయింపు.

 • కొత్తగా 10 కోట్ల మంది వృద్ధులకు లబ్ధి.
 • వన్ ర్యాంక్ - వన్య పెన్షన్ కోసం రూ. 35 వేల కోట్లు.
 • త్వరలోనే 'వందే భారత్' ఎక్స్ ప్రెస్ రైలు పరుగులు.
 • కేంద్ర స్థాయిలో ప్రత్యేక మత్స్య శాఖ ఏర్పాటు.
 • పశు సంవర్థక, మత్స్య పరిశ్రమలకు 2 శాతం వడ్డీ రాయితీ.
 • ప్రధానమంత్రి కౌశల్ యూజన ద్వారా కోటి మంది యువతకు లబ్ది.
 • రైల్వేలకు బడ్జెటరీ సపోర్ట్ కింద రూ. 64,587 కోట్లు.
 • మిజోరం, మేఘాలయా రాష్ట్రాలను రైల్వేతో అనుసంధానం.
 • బ్రాడ్ గేజ్ మార్గాల్లో ఇప్పటికే తొలగిపోయిన కాపలాలేని లెవల్ క్రాసింగ్ లు.
 • ఈశాన్య భారతావని కూడా మౌలికరంగ అభివృద్ధిని చూస్తోంది.
 • ఈశాన్య భారత దేశానికి కేటాయింపులు రూ.58,166 కోట్లకు పెంపు. గత ఏడాదితో  పోలిస్తే ఇది 21శాతం అదనం.
 • గడచిన ఐదేళ్లలో సౌర విద్యుత్ ఉత్పత్తి 10 రెట్లు పెరిగింది.
 • గడచిన ఐదేళ్లలో 34 కోట్ల జన్ ధన్ అకౌంట్ల ప్రారంభం.
 • ప్రత్యక్ష పన్నుల ద్వారా ఆదాయం రూ. 12 లక్షల కోట్లు.
 • 80 శాతం పెరిగిన పన్ను చెల్లింపుదారుల సంఖ్య.
 • సెక్షన్ 80సీ పరిమితి రూ. లక్ష నుంచి రూ. 1.50 లక్షలకు పెంపు.
 • ఇక పేద, మధ్యతరగతి ప్రజలంతా 0 నుంచి 5 శాతం పన్ను పరిధిలో మాత్రమే.
 • సినిమా పరిశ్రమ 12 శాతం జీఎస్టీ పరిధిలోకి.
 • సినిమా షూటింగ్ అనుమతులకు సింగిల్ విండో.
 • రోజుకు 27 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం.
 • దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరగాళ్లను వదిలే సమస్యే లేదు.
 • అందరినీ ఇండియాకు రప్పించి బకాయిలు వసూలు చేస్తాం.
 • బినామీ ఆస్తుల వివరాలన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. వాటిని అటాచ్ చేశాం.
 • 3 లక్షలకు పైగా బినామీ కంపెనీలను డీ రిజిస్టర్ చేశాం.
 • గడచిన సంవత్సరం కోటి మందికి పైగా పన్ను చెల్లించారు.
 • స్వతంత్ర భారతావనిలో ఇంతమంది నుంచి రిటర్నులు దాఖలు కావడం ఇదే తొలిసారి.
 • వచ్చే ఐదేళ్లలో ఇండియా 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా రూపాంతరం చెందుతుంది.
 •  'ఈజ్ ఆఫ్ బిజినెస్' తో పాటే 'ఈజ్ ఆఫ్ లివింగ్'
 • మరిన్ని విమానాశ్రయాలు రానున్నాయి.
 • ఇన్ లాండ్ వాటర్ వేస్ కు పెద్దపీట.
 • పట్టణాలను మరింత పరిశుభ్రం చేస్తాం.
 • శాస్త్ర, సాంకేతిక, అంతరిక్ష రంగాలకు మరిన్ని కేటాయింపులు.
 • రూ. 40 వేల నుంచి రూ.50 వేలకు స్టాండర్డ్ డిడక్షన్‌ పెంపు .
 • డిజిటల్ ఇండియా కలను సాకారం చేసి చూపిస్తాం.
 • అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, ఆర్థిక లావాదేవీలను డిజిటల్ మాధ్యమంగానే సాగేలా చర్యలు.
 • ఇండియాను కాలుష్య రహిత భారతావనిగా మార్చేందుకు చర్యలు.
 • ఎలక్ట్రిక్ వాహనాలకు మరిన్ని రాయితీలు.
 • ట్రాన్స్ పోర్ట్ విప్లవంలో ప్రపంచానికే ఆదర్శంగా మారనున్న భారతావని.
 • సరుకు రవాణా రంగంలోనూ ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహం.
 • ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ప్రోత్సహిస్తాం.
 • రెండో గృహానికి కూడా అద్దె చెల్లించే వారికి ఆ మేరకు ఆదాయ పన్ను మినహాయింపు. 
 • ఎస్సీ, ఎస్టీ సంక్షేమ నిధిని రూ.62,574 కోట్ల నుంచి రూ.76,800 కోట్లకు పెంచారు.  కేటాయింపుల్లో 35శాతానికి పైగా పెంపు.
 •  ప్రకృత్తి విపత్తులకు గురైన ప్రాంతాల్లోని రైతులు తీసుకొన్న రుణాలపై 2 శాతం వడ్డీ రాయితీ, దీంతోపాటు సకాలంలో చెల్లింపులు చేసిన వారికి 3శాతం వడ్డీ రాయితీ.
 • గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామికీకరణకు సమయం ఆసన్నమైంది.
 • మేకిన్ ఇండియాలో భాగంగా గ్రామాలకు భారీ పరిశ్రమలను దగ్గర చేస్తాం.
 • గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్ గా ఇప్పటికే మారిపోయిన ఇండియా.
 • గంగానదిని కాలుష్య రహితంగా మార్చి చూపుతాం.
 • ఇందుకోసం పంచసూత్ర ప్రణాళికను అమలు చేయనున్నాం.
 • అంతరిక్ష కార్యక్రమాలకు మరిన్ని నిధులను కేటాయిస్తాం.
 • ప్రపంచ దేశాల శాటిలైట్లను నింగిలోకి చేర్చడంలో మనమే ముందున్నాం.
 •  ఆహార ఉత్పత్తులను మరింత సేంధ్రీకరిస్తాం.
 • పురుగు మందులు వాడని పంటతో మరింత ఆరోగ్యం.
 • 2025 నాటికి ప్రతి దేశ పౌరుడికీ ఆరోగ్యం.
శ్లాబులు 
 • శ్లాబుల విషయానికి వస్తే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య ఆదాయం ఉంటే 20 శాతం ఆదాయ పన్ను ఉంటుంది. 
 • రూ.10 లక్షల పైన ఎంత ఉన్నా 30 శాతం పన్ను ఉంటుంది. గతంలో రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్న వారికి రూ.12,500 పన్ను ఉండేది. ఇప్పుడు అది సున్నా.
 • ప్రావిడెంట్ ఫండ్‌లో పెట్టుబడులు పెడితే 6.5 లక్షల లోపు ఆదాయపన్ను మినహాయింపు ఉంటుంది. 
 • బ్యాంకులు, పోస్టాఫీసుల్లో పొదుపు చేసే వారికి పన్ను మినహాయింపు ఇస్తారు.
 • పొదుపు ఖాతాలపై వచ్చే వడ్డీ రూ.10వేల నుంచి రూ.40వేల కోట్లకు పెంచారు. సేవింగ్స్ పైన రూ.40వేల వరకు పన్ను మినహాయించారు.

Budget 2019 Highlights,2019 Budget Highlights,today Budget Highlights,central government  Budget Highlights,,central government  Budget Highlights 2019,
Previous
Next Post »
0 Komentar