DigiLocker App
ప్రతి అవసరానికి చేతిలో ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, వెహికల్ RC,ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ల వంటివి తీసుకెళ్లడం తప్పనిసరి అవుతోంది.
దీన్ని దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం చాలాకాలం క్రితమే DigiLocker అనే అప్లికేషను సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే అప్పట్లో కేవలం ఆధార్ కార్డు మాత్రమే దీంట్లో స్టోర్ చేసుకోవటం సాధ్యపడేది. ఇప్పుడు అన్ని డాక్యుమెంట్లు భద్రపరచుకునే అవకాశం వచ్చింది. ఈ నేపథ్యంలో DigiLocker సర్వీస్ వాడడం ఎలాగో ఇప్పుడు చూద్దా .
మీరు వాడుతున్న Android, iOS ఫోన్లో క్రింద ఇచ్చిన లింక్ ద్వారా గాని, గూగుల్ ప్లే స్టోర్ నుండి గానీ, Apple App Store నుండి గానీ DigiLocker అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది. అది ఎంటర్ చేసి Continue ప్రెస్ చేస్తే, వెంటనే మీ ఫోన్ కి OTP పంపించబడుతుంది. అది ఎంటర్ చేసి వెరిఫై చేసిన తర్వాత.. ఒక యూసర్ నేమ్, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని ఈ అప్లికేషన్ సూచిస్తుంది. 3 నుండి 50 అక్షరాల మధ్య username ఉండొచ్చు. అయితే అన్ని లోయర్ కేస్ అక్షరాలు, నెంబర్లు, ప్రత్యేక చిహ్నాలు వాడొచ్చు. అలాగే పాస్వర్డ్ విషయంలో కూడా అక్షరాలు, నెంబర్లు, ప్రత్యేక చిహ్నాలను కలిపి వాడవలసి ఉంటుంది.
అకౌంట్ క్రియేట్ చేసుకోవడం పూర్తయిన తర్వాత మీ Aadhaar card రిజిస్టర్ చేసుకోమని DigiLocker కోరుతుంది. మీ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి Continue ప్రెస్ చేశాక మీ నెంబర్ కి ఒక OTP వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి Continue ప్రెస్ చేయగానే, ఆధార్ సర్వర్ నుండి మీ ఆధార్ కార్డు download అవుతుంది. ఇకపై ఈ ఆధార్ కార్డు DigiLocker అప్లికేషన్లో చూపించబడుతుంది. ఇక ఎక్కడైనా ఆధార్ కార్డు చూపించాలంటే దీన్ని చూపిస్తే సరిపోతుంది. ఇది కేంద్ర ప్రభుత్వ అధికారిక అప్లికేషన్ అవ్వడంవలన ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇక్కడ మీరు చూపించే ఆధార్ కార్డ్ లీగల్ ప్రూఫ్‌గా స్వీకరిస్తారు.
Click Here....To Download DigiLocker App For Android Mobiles
Click Here....To Download DigiLocker App For iPhone and ipad
Click Here....To Download DigiLocker App For iPhone and ipad
DigiLocker App,,digilocker app download for android free,digilocker application,digilocker app uses,digilocker app ios,digilocker app apk,digilocker apps free download,digilocker app download,digilocker app free download,digilocker android app,digilocker android app download,is digilocker app available for iphone,about digilocker app,digilocker app by indian government,digilocker app benefits,www.digilocker app.com,digilocker app download for iphone,digilocker app download for apk,digilocker app for ios,digilocker app forgot username,digilocker app download for android,digilocker app government of india,government digilocker app for iphone,google digilocker app,digilocker app how to use,digilocker app is safe,digilocker app information,digilocker app india,digilocker app issues,digilocker in app store,digilocker app link
0 Komentar