Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Jio will now charge users 6 paise per minute on calls to other networks

Jio will now charge users 6 paise per minute on calls to other networks


జియో నుండి ఇతర నెట్ వర్క్స్  కు కాల్‌ చేస్తే ఛార్జి
★ ప్రముఖ టెలికాం కంపెనీ జియో కీలక ప్రకటన చేసింది. ఇకపై జియో నెట్‌వర్క్‌ నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌కు నిమిషానికి 6 పైసలు చొప్పున వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
★ అయితే, వినియోగదారులు చెల్లించిన మొత్తానికి బదులుగా డేటాను తిరిగి అందివ్వనున్నామని ప్రకటించింది. ఐయూసీ ఛార్జీల విషయంలో ట్రాయ్‌ ఇచ్చిన నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది.
★ అయితే, జియో సొంత నెట్‌వర్క్‌ కాల్స్‌కు ఎలాంటి ఛార్జీలూ వసూలు చేయబోమని ప్రకటించింది. అలాగే, ఇన్‌కమింగ్‌ కాల్స్‌కు, ల్యాండ్‌ లైన్స్‌ విషయంలో ఎలాంటి రుసుమూ వసూలు చేయబోమని తెలిపింది.
★ అక్టోబర్‌ 10 తర్వాత రీఛార్జి చేసే వారికి ఈ ఛార్జీలు వర్తిస్తాయని పేర్కొంది.
★ ఇప్పటి వరకు జియో యూజర్లు కాల్స్  కు ఎలాంటి ఛార్జీలూ చెల్లించడం లేదు. కేవలం డేటాకు మాత్రమే చెల్లించేవారు.
★ అయితే, ఐయూసీ ఛార్జీలు పూర్తిగా ఆపేసిన రోజున ఈ ఛార్జీలను వసూలు చేయబోమని ప్రకటించింది. అదే సమయంలో కాల్స్‌కు వసూలు చేసిన మొత్తాన్ని డేటా రూపంలో తిరిగి వినియోగదారులకు అందివ్వనున్నట్లు పేర్కొంది.
★ ఇందుకోసం కొన్ని టాపప్‌ వోచర్లను ప్రకటించింది. దీనివల్ల వినియోగదారులపై అదనపు భారం పడదని జియో పేర్కొంది.
★ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్‌) 2017లో ఇంటర్‌ కనెక్ట్‌ యూసేజ్‌ ఛార్జీలను (ఐయూసీ) నిమిషానికి 14 పైసల నుంచి 6 పైసలకు తగ్గించింది. 2020 జనవరి తర్వాత పూర్తిగా రద్దు చేయాలనుకుంటోంది.
టాపప్‌ వోచర్ల వివరాలు

Previous
Next Post »
0 Komentar

Google Tags