Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Cricket Records: Sonam Yeshey Creates History with 8-Wicket Haul in Men’s T20Is

 

Cricket Records: Sonam Yeshey Creates History with 8-Wicket Haul in Men’s T20Is

క్రికెట్ రికార్డులు: పురుషుల టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 8 వికెట్లు తీసి చరిత్ర సృష్టించిన భూటాన్ ఆటగాడు  సోనమ్ యెషే

==================

అంతర్జాతీయ టీ20ల్లో భూటాన్ ఎడమచేతి వాటం స్పిన్నర్ సోనమ్ ఎషే కొత్త రికార్డు సృష్టించాడు. ఒకే మ్యాచ్ లో ఏకంగా 8 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. అంతర్జాతీయ టీ20లు, ఇతర టీ20 లీగ్ ల్లోనూ ఇప్పటివరకు ఈ ఫీట్ ఎవరూ నమోదు చేయలేదు.

మయన్మార్ ఇటీవల జరిగిన మూడో టీ20లో సోనమ్ ఈ ఘనత సాధించాడు. 22 ఏళ్ల సోనమ్.. నాలుగు ఓవర్లు వేసి ఏడు పరుగులు ఇచ్చి ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక మెయిడిన్ ఓవర్ ఉండటం విశేషం. ఈ యువ స్పిన్నర్ ధాటికి మయన్మార్ 45 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరు చేయగా.. నలుగురు డకౌటయ్యారు. ఈ మ్యాచ్లో భూటాన్ 82 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది.

==================

పురుషుల టీ20 క్రికెట్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు

1. సోనమ్ ఎషే (భూటాన్).. 8/7.. మయన్మార్ పై 2025

2. శ్యాజ్రుల్ ఇద్రుస్ (మలేసియా).. 7/8.. చైనాపై 2023

3. అలీ దావూద్ (బహ్రెయిన్).. 7/19.. భూటాన్ పై 2025

4. హర్ష భరద్వాజ్ (సింగపూర్).. 6/3.. మంగోలియాపై.. 2024

5. పీటర్ అహో (నైజీరియా).. 6/5.. సియెర్రా లియోన్ పై.. 2021

6. దీపక్ చాహర్ (భారత్).. 6/7.. బంగ్లాదేశ్ పై. . 2019

==================

RECORDS PAGE

SCORE CARD

==================

Latest
Previous
Next Post »
0 Komentar

Google Tags