Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

School assembly 11th December information

School assembly 11th December 2019 info
నేటి ప్రాముఖ్యత
యూనిసెఫ్ దినోత్సవం.
చరిత్రలో ఈ రోజు
యునిసెఫ్ ఆవిర్భావం
యునిసెఫ్ (United Nations International Children's Emergency Fund) ను 1946 డిసెంబరు 11 వ తేదీన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఏర్పాటు చేసారు . జాతి , మత , రాజకీయ వివక్షలేవి లేకుండా పిల్లలకు సహాయపడాలన్నది యునిసెఫ్ లక్ష్యము.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జననం          
ప్రణబ్ ముఖర్జీ డిసెంబరు 11, 1935న జన్మించారు. ఈయన స్వగ్రామం పశ్చిమబెంగాల్ లోని బిర్బం జిల్లా మిరాఠీ. ప్రణబ్ ముఖర్జీ భారతదేశానికి 2012 నుండి 2017 వరకు 13వ రాష్ట్రపతిగా బాధ్యతలను నిర్వర్తించాడు. కేంద్రప్రభుత్వంలో అనేక మంత్రిత్వ పదవులను నిర్వహించాడు.
1891లో  తెలుగునాట మొట్టమొదటి వితంతు పునర్వివాహం కందుకూరి వీరేశలింగం పంతులు ఆధ్వర్యంలో, రాజమండ్రిలో జరిగింది.
 నేటి అంశము - సాంకేతిక పరిజ్ఞానము
ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం (Android OS) దాని చరిత్ర 
స్మార్ట్ ఫోన్ పని చేయాలి అంటే దానికి ఒక ఆపరేటింగ్ సిస్టం అవసరమౌతుంది. ఇప్పుడు లభించే స్మార్ట్ ఫోన్ లలో ఎక్కువ భాగం (85%) ఆండ్రాయిడ్ ఒ.ఎస్ (ఆపరేటింగ్ సిస్టం) ను ఉపయోగిస్తున్నారు.
ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం మొదటిగా బీటా వెర్షన్ ను నవంబరు 5, 2007 న రిలీజ్ చేశారు. అయితే కమర్షియల్ వర్షన్ ఆండ్రాయిడ్ 1.0 ను సెప్టెంబర్ 23 2008 నుంచి అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే 1.1 మరియు 1.2 వర్షన్ లకు ఎటువంటి పేర్లు ఇవ్వలేదు. తరువాత 2009లో ప్రారంభమైన 1.5 కు కప్ కేక్ అని నామకరణం చేశారు. అప్పటి నుండి ఇంగ్లీష్ ఆల్ఫా బెటికల్ ఆర్డర్ లో నామకరణం చేయుచున్నారు. ఆగస్టు 2018 నుండి ఆండ్రాయిడ్ 9 పై  & సెప్టెంబర్ 2019 నుండి ఆండ్రాయిడ్ 10.0 (ప్రత్యేకించి నామకరణం చేయబడలేదు) అందుబాటులో ఉన్నవి. అయితే వీటి పేర్లను బేకరీ ఐటమ్స్ (స్వీట్ షాపుల్లో దొరికే ఐటమ్స్) పేర్లను ఉంచటం జరుగుచున్నది. వీటిలో బాగా పాపులర్ అయినవి  కిట్ కాట్ , లాలీ పాప్.
మంచి మాట
అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం – బుద్ధుడు
మంచి పద్యం
ఇష్టమైనది కష్టపెట్టిన
కలిసివుంటే నష్టముండదు
సహనమే సంసారనావను
దరికి చీర్చే ఇంధనం......!
నేటి జీ.కె
ప్రశ్న: శ‌రీరంలో టెలిఫోన్ వైర్లలా ప‌నిచేసే నిర్మాణాలు ఏవి?
జ: నాడులు


వార్తలలోని ముఖ్యాంశాలు
> దేశంలో ఇటీవల మహిళలపై జరిగిన దాడులపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అందరికీ సమాన హక్కులు అనే లక్ష్యాన్ని అందుకున్నామా అనే దానిపై ఆలోచించాల్సిన స్థితి ఏర్పడిందన్నారు.
>పెంచిన ఏపీఎస్ఆర్టీసీ  బస్ చార్జీలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. కొన్ని సర్వీసులకు కిలోమీటరుకు 10 పైసలు మరికొన్ని టికి 20 పైసలు పెంచారు. పల్లె వెలుగు లో కనీస ఛార్జి 5 రూ., ఎక్స్ ప్రెస్ లో కనీసం ఛార్జి 15  రూ. ఉండనున్నాయి.
> దిశ హత్యకేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ స్వయంగా సుప్రీంకోర్టులో విచారణకు హాజరుకానున్నారు.
>2000 రూపాయల నోట్ ను రద్దు చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
>ప్రముఖ భారతీయ అమెరికన్ ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని స్వీడన్ దేశ రాజు కారల్ గుస్టాఫ్  నుంచి  మంగళవారం అందుకున్నారు.
>నేడు పీ.ఎస్.ఎల్.వి -సి 48 ను నెల్లూరు జిల్లా శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనున్నారు. ఈ నౌక 10 ఉపగ్రహాలను నింగిలోని కి తీసుకెల్లనుంది. ఇది ఇస్రో కు 50 వ ప్రయోగం.

> దక్షిణ ఆసియా క్రీడల్లో భారత్కు చరిత్ర సృష్టించింది ఆద్యంతం ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ 312 పతకాలను సాధించి అగ్రస్థానంలో టోర్నీని ముగించింది ఈ పోటీల చరిత్రలో భారత్కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన.
School assembly 11th December 2019 info, School Assembly, prayer songs, Assembly information, historical events, information of the day, news of the day, golden words, today golden words, moral sentences, today's importance, headlines in the news, december month school assembly day wise, december 2019 school assembly, december 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు11th december 2019 assembly, 11th december 2019 assembly, news of the day history, news of the day highlights, 11th dec 2019 assembly, dec 11th assembly, dec 11th historical events, 11th december 2019 assembly, december 11th assembly, december 11th historical events, school related today assembly, school related today news, school related december 11th information, school related december month information
Previous
Next Post »

1 comment

Google Tags